Samantha : మరింత స్ట్రాంగ్‌గా తయారవుతా.. ఆ డైరెక్టర్ ఇచ్చిన గిఫ్ట్‌తో సమంత..

తాజాగా సమంత మరింత త్వరగా కోలుకోవాలంటూ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. సింగర్ చిన్మయి భర్తగా రాహుల్ సమంతకి బాగా క్లోజ్. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ సమంతకి ఒక ఫ్రేమ్ ని పంపించాడు. ఈ ఫ్రేమ్ లో sammy అని తన పేరుతో పాటు సమంత గురించి..............

Samantha :  సమంత చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో షూటింగ్స్ అన్ని ఆపేసి ఇంటి వద్దే ఉంటుంది. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు అంతా కోరుకుంటున్నారు.

తాజాగా సమంత మరింత త్వరగా కోలుకోవాలంటూ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. సింగర్ చిన్మయి భర్తగా రాహుల్ సమంతకి బాగా క్లోజ్. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ సమంతకి ఒక ఫ్రేమ్ ని పంపించాడు. ఈ ఫ్రేమ్ లో sammy అని తన పేరుతో పాటు సమంత గురించి మోటివేషనల్ కొటేషన్స్ ఉన్నాయి.

ఈ ఫ్రేమ్ లో.. చీకటితో ఉన్న సొరంగంలో అంతం కనపడట్లేదు, వెలుతురు కూడా కనపడట్లేదు, కానీ అడుగులు భారంగా మారినా శక్తినంతా కూడాతీసుకొని ముందుకే వెళ్తావు. భయాలన్నీ పక్కన పెట్టి సైనికుడిలా మారతావు. నువ్వు ఉక్కు మనిషివి, ఇప్పుడు నువ్వు సాధించిన విజయాలు నీ జన్మ హక్కు. ఇలాగే చీకట్లో నడుస్తూ ఉండు, త్వరలోనే సూర్యుడు ప్రకాశవంతంగా వస్తాడు. నువ్వు ఓడిపోవు, ఇలాంటి కష్టకాలాన్ని ధైర్యంగా దాటగలిగే నీలాంటి వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే నిన్ను ఏది ఓడించలేదు, ఇప్పటికంటే, గతంలో కంటే మరింత బలంగా తయారవుతావు అని రాసి ఇచ్చాడు.

Prabhas : రాజా డీలక్స్.. సైలెంట్‌గా కానిచేస్తున్న ప్రభాస్.. లీక్ అయిన షూటింగ్ పిక్స్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

ఈ ఫ్రేమ్ ని సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. థ్యాంక్ యు రాహుల్, నాలాగే కష్టమైన యుద్దాలని ఎదుర్కుంటున్న వాళ్లందరికీ ఇది అంకితం. నేను మరింత స్ట్రాంగ్ గా తయారవుతాను, ఎప్పటికి స్ట్రాంగ్ గా ఉంటాను అని పోస్ట్ చేసింది. దీంతో సమంత చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఇది వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు