Kedarnath : కేదార్‌నాథ్‌ మందిరం స్వర్ణ తాపడంలో రూ.125 కోట్ల కుంభకోణం..! కలకలం రేపుతున్న పూజారి ఆరోపణలు

కేదారనాథుడి మందిరం స్వర్ణతాపడంలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. కేరార్ నాథ్ మందిర గోడల స్వర్ణతాపంలో రూ.125 కోట్లు కుంభకోణం జరిగిందనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

Kedarnath temple

Kedarnath temple Rs 125 crore Gold scam : దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ (uttarakhand)లోని హిమగిరుల్లో వెలసిన కేదార్ నాథ్ (Kedarnath temple)ను దర్శించుకోవటానికి ఎంతోమంది భక్తులు వ్యయప్రయాసలకు ఓర్చుకుని దర్శించుకుంటారు. ఆ స్వామిని దర్శించుకోగానే వారి కష్టమంతా మర్చిపోతారు. అటువంటి కేదారనాథుడి మందిరం స్వర్ణతాపడంలో భారీ కుంభకోణం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. కేరార్ నాథ్ మందిర గోడల స్వర్ణతాపంలో (gold plate installed ) రూ.125 కోట్లు (Rs 125 crore scam) కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు కేదార్ నాథ్ ఆలయం సీనియర పూజారి సంతోష్ త్రివేది (priest Santosh Trivedi)చేశారు.

బంగారం తాపడం కాస్తా ఇత్తడిగా మారింది అంటూ సాక్షాత్తు ఆలయ సీనియర్ పూజారి త్రివేది (priest Santosh Trivedi)చేసిన ఈ సంచలన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. గర్భగుడిలో బంగారాన్ని తనిఖీ చేయలేదని చార్ థామ్ మహా సంచాయత్ ఉపాధ్యక్షుడు, కేదార్ నాథ్ ఆలయ సీనియర్ పూజారీ త్రివేది ఆరోపిస్తు..కొన్ని నెలల క్రితం కేదార్ నాథ్ ఆలయ గర్భగుడిలో బంగారు పొరల తాపడం (gold plate installed )పూర్తి అయ్యిందని కానీ తాను కొన్ని రోజుల క్రితం వెళ్లి పరిశీలించగా బంగారం కాస్తా ఇత్తడిగా కనిపిస్తోందరి ఇదంతా కుంభకోణం అని ఆరోపణలు చేశారు. పని పూర్తి అయ్యాక తనిఖీలు ఎందుకు చేయాలేదు. దీనికి బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెల 19న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

ఈ ఆరోపణలను బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయ కమిటీలు (Kedarnath Temple Committee (BKTC))కొట్టిపారేశారు. భక్తులను తప్పుదోవ పట్టించటానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఇదంతా తప్పుడు ప్రచారమని దీంట్లో రాజకీయ కుట్ర ఉంది అంటూ ఆరోపించారు. మహారాష్ట్రకు చెందిన ఓ మహా దాత గర్భగుడిలో గోడలకు స్వర్ణ తాపడం చేయించాలని తన పేరు బహిరంగ పరచవద్దు అంటూ కోరుతు 230 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. కానీ ఈ పనుల్లో కుంభకోణం జరిగిందని ఆలయం గర్భగుడి అంతర్గత గోడలను బంగారు రేకులతో తాపడం చేస్తున్నట్లుగా నమ్మించి ఇత్తడి రేగులతో చేశారు అంటూ త్రివేది ఆరోపించారు తీర్థ్‌ పురోహిత్‌ మహా పంచాయత్‌కు ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్న సంతోష్‌ త్రివేది..ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా చర్యలు తీసుకోకపోతే తాను ఆందోళన చేపడతానని తెలిపారు.

ఈ సంచలన ఆరోపణలపై ఆయల కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ మాట్లాడుతు..ప్రధాని మోదీ (PM Modi), నాయకత్వంలో కేదార్ నాథ్ అభివృద్ధి పనులు అత్యద్భుతంగా జరిగాయని..భక్తులు కూడా భారీగా వస్తున్నారని ఈ అభివృద్ధి చూసి ఓర్వలేని కొంతమంది ఇటువంటి ఆరోపణలు చేస్తుంటారు అంటూ కొట్టిపారేశారు.

కాగా త్రివేది ఆరోపణలు, అలాగే మాజీ సీఎం, సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav)డిమాండ్ చేయటంతో కేదార్ నాథ్ ఆలయ గోడల స్వర్ణతాపడం అంశం రచ్చకు దారి తీసింది. “కేదార్‌నాథ్ ఆలయంలో బంగారు పొరలకు బదులుగా ఇత్తడి పొరలను వర్తింపజేయడం నేరారోపణతో పాటు విశ్వాసంతో ఆడుకోవడం చాలా సున్నితమైన విషయం. ఈ కుట్రపై ఉన్నత స్థాయి విచారణ జరిపి అబద్ధాల పొరలను తొలగించాలి’ అని అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav)ట్వీట్ చేశారు.

Srisailam Temple : మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వడ ప్రసాదం మళ్లీ ప్రారంభం

బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చట్టం (Badrinath-Kedarnath Temple Committee Act, 1939), 1939లో పేర్కొన్న నిబంధనల ప్రకారం వ్యాపారవేత్తకు అనుమతి మంజూరు చేసినట్లు ఆలయ కమిటీ స్పష్టం చేసింది. గుప్తదాత 230 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని అతని చిరకాల కోరిక అని చెప్పారని కమిటీ తెలిపింది. కేదార్‌నాథ్ గర్భగుడి గోడలను బంగారంతో తాపడం చేసారని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని BKTC తెలిపింది. భారత పురావస్తు శాఖ నిపుణుల పర్యవేక్షణలో బంగారు పూత పూయడం జరిగిందని తెలిపారు. దాత తన స్థాయిలో స్వర్ణకారుల నుండి రాగి పలకలను సిద్ధం చేసి..ఆపై వాటిపై బంగారు పొరలను సమర్పించారు. దాత తన ఆభరణాల ద్వారా ఆలయంలో ఈ ప్లేట్‌లను అమర్చాడు” అనివెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు