Mega154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తుండగా, ఆయన యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరు కెరీర్లో 154వ చిత్రంగా వస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Mega154: మెగాస్టార్‌తో మాస్ చిందులు.. ఆ తరువాతే యాక్షన్..?
ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో చిరుతో పాటు మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర, అతడు చిరంజీవితో చేతులు కలిపే సీన్స్‌కు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రవితేజ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని.. ఆయన పాత్ర సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమాలో ఆయన చిరంజీవితో కలిసేది ఓ సెంటిమెంట్ కారణంగా అని కూడా తెలుస్తోంది.
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
ఈ సినిమాలో రవితేజ తల్లి పాత్రలో సీనియర్ నటి సుమలత నటిస్తోంది. ఆమె కారణంగా చిరుతో రవితేజ చేతులు కలుపుతాడని, ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలు సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తాయని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వార్తతో మెగా ఫ్యాన్స్‌లో మరోసారి ఈ సినిమాపై ఆసక్తిని డబుల్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ మూవీలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.