Opposition Meet: ఒక్క సీటు కూడా లేదు, బీజేపీని ఛాలెంజ్ చేస్తున్నారు.. తేజశ్వీపై సుశీల్ మోదీ సెటైర్లు

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ రాష్ట్రంలో ఉన్న 40 లోక్‭సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలుస్తుందని ఆయన అన్నారు. కాగా, విపక్షాల మీటింగ్ మార్పు తీసుకువస్తుందని గురువారం తేజశ్వీ యాదవ్ అన్నారు.

Sushil Modi: విపక్షాల సమావేశం జరగనున్న ఒక్క రోజు ముందు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‭పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భారతీయ జనతా పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ. దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేసి బీజేపీ బీజేపీని ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి లోక్‭సభలో ఒక్క సీటు కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంటులో భారతీయ జనతా పార్టీకి 303 స్థానాలు ఉన్నాయని, అందులో సగం కూడా విపక్షాలకు లేవని, మరి బీజేపీని ఓడిస్తామని ఎలా అనుకుంటున్నారంటూ సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు.

Opposition Meet: విపక్షాల మీటింగుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ రాష్ట్రంలో ఉన్న 40 లోక్‭సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలుస్తుందని ఆయన అన్నారు. కాగా, విపక్షాల మీటింగ్ మార్పు తీసుకువస్తుందని గురువారం తేజశ్వీ యాదవ్ అన్నారు. దీనిపై సుశీల్ స్పందిస్తూ ‘‘తేజశ్వీ పార్టీకి లోక్‭సభలో ఒక్క సీటు కూడా లేదు. వాళ్లు 303 సీట్లున్న బీజేపీని ఛాలెంజ్ చేయడమేంటి? విపక్షాల సమావేశానికి హాజరయ్యే పార్టీలన్నీ కలిపినా బీజేపీలో సగం స్థానాలు ఉండవు. వీళ్లు మోదీని ఓడిస్తామని శపథం చేస్తున్నారు. ఏదేమైనా వారి ఆశలు నెరవేరవు. సంపూర్ణ మెజారిటీతో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుంది’’ అని అన్నారు.

Bihar Politics: ప్రధాని మోదీని ఛాలెంజ్ చేసే ప్రతిపక్ష నాయకుడే లేడట.. అమిత్ షాను కలవగానే స్వరం మార్చిన మాంఝీ

విపక్షాల సమావేశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం జరగనున్న ఈ సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. మణిపూర్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని చాలా ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. మణిపూర్ లో హింసపై కేంద్ర మంత్రి అమిత్ షా జూన్ 24న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు