Telangana : జోరు వానలు, ప్రాజెక్టులు ఫుల్

జోరు వానలతో తెలంగాణలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Heavy Rains : జోరు వానలతో తెలంగాణలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నల్లగొండలో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ఆరు గేట్లు ఎత్తి నీటి విడుదల దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ ఫ్లో 15 వేల 3 వందల 94 క్యూసెక్కులు ఉండగా….అవుట్ ఫ్లో 21 వేల 6 వందల 27 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉండగా…ప్రస్తుత నీటి నిల్వ 3.38 టీఎంసీలుగా ఉంది.

Read More : Telangana Rains: దంచికొడుతున్న వానలు.. మబ్బులకు రంధ్రం పడిందా?

ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు జురాలకు జలకళ సంతరించుకుంది. రిజర్వాయర్‌లో పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లుగా ఉండగా…ప్రస్తుతం 317.840 మీటర్లు నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో  ఒక లక్షా 21 వేల క్యూసెక్కులు ఉండగా…20 గేట్లు ఎత్తి…ఒక లక్షా 5 వేల 110 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి పొంగి ప్రవహిస్తుండటంతో కాళేశ్వరం నిండుకుండలా మారింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బ్యారేజ్ 66 గేట్లు ఎత్తారు అధికారులు. బ్యారేజ్‌లోకి ఇన్ ఫ్లో 2 లక్షల 41 వేల 150 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు. బ్యారేజ్‌లో ప్రస్తుతం నీటిమట్టం 3.921 టీఎంసీలుగా ఉంది.

Read More : Srisailam : శ్రీశైలంలో సహస్ర దీపార్చన, వీరభద్రుడికి ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. రిజర్వాయర్‌కు ఒక లక్షా 14 వేల 270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో 30 గేట్లను ఎత్తి ఒక లక్షా 65 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌ మూడు గేట్లు ఎత్తారు అధికారులు. పూర్తి స్థాయి నీటిమట్టం 7 వందల అడుగులు ఉండగా….6 వందల 97.550అడుగుల నీరు ఉంది. దీంతో భారీగా నీటిని దిగువకు వదులుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు