Oxygen Infrastructure : ఆక్సిజన్ ప్లాంట్లు,నిల్వలు,సిలిండర్లపై దృష్టి పెట్టండి-మన్సుఖ్ మాండవీయ

దేశంలో  కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.

Oxygen Infrastructure :  దేశంలో  కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ఆయన నిన్న కొన్నిరాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్ష నిర్వహించారు.

అన్ని రకాల ఆక్సిజన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లు పనిచేసేట్టు సిధ్దం చేసుకోవాలని చెప్పారు. దేశంలో  కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్ని,  ఎవ్వరూ   అశ్రధ్ధ వహించవద్దని అన్నారు. కోవిడ్ ను ఎదుర్కునే క్రమంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచించారు.
Also Read : Rajasthan Govt: బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 11 సార్లు కరోనా సోకిన వ్యక్తి!
ముఖ్యంగా జిల్లాల్లో   వైద్య సదుపాయాలపై దృష్టి సారించాలని ప్రతి జిల్లాలో టెలికన్సల్టేషన్ హబ్ ను ఏర్పాటు చేసి  ఆరోగ్య సేవలు విస్తృతంగా ప్రచారం చేయాలని మాండవీయ చెప్పారు. ఈ సమావేశంలో గుజరాత్, మధ్యప్రదేశ్,రాజస్ధాన్, గోవా, మహారాష్ట్ర,ఆరోగ్య మంత్రులతో పాటు దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూ కి  చెందిన ఆరోగ్య శాఖా మంత్రులు పాల్గోన్నారు.

ట్రెండింగ్ వార్తలు