Vivo X90 Series Launch : పిక్సెల్ 7, వన్‌ప్లస్ 11కు పోటీగా వివో X90 సిరీస్.. ఏప్రిల్ 26నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Vivo X90 Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి సరికొత్త మోడల్ X90 సిరీస్ వస్తోంది. ఏప్రిల్ 26న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..

Vivo X90 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో ఏప్రిల్ 26న Vivo X90 సిరీస్ పేరుతో లాంచ్ కానుంది. Vivo X సిరీస్‌లో బెటర్ ఫొటోగ్రఫీని అందించనుంది. ఇలాంటి ఫోన్ కోసం చూసేవారికి భారత్‌లో రూ. 60వేల కన్నా తక్కువ ధర ఉన్న OnePlus 11, Pixel 7 వంటి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు. Vivo X80 గత ఏడాది మేలో లాంచ్ అయింది.

దీని ప్రారంభ ధర రూ. 54,999గా ఉంది. ఆ తర్వాత Vivo X90 ఇదే ధర రేంజ్‌లో అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి స్టాండర్డ్, ప్రో మోడల్ భారత్‌లోనూ లాంచ్ చేయాలని భావిస్తున్నారు. భారతీయ వేరియంట్‌ల స్పెసిఫికేషన్‌లు చైనీస్ మోడల్‌ల మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. రాబోయే Vivo X90 సిరీస్ స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్లు ఇవే :
చైనాలో (Vivo X90) ప్రో వెర్షన్ వాటర్, డస్ట్ నిరోధకతకు IP68 రేట్ అందిస్తోంది. ఈ డివైజ్‌లు సరికొత్త ఆండ్రాయిడ్ 13 OS అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తాయి. భారీ డిస్‌ప్లేలతో పాటు కొన్ని ఇతర హై-ఎండ్ ఫీచర్‌లను అందిస్తాయి. పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. ఈ ప్రో మోడల్‌లు వెనుక భాగంలో ప్రీమియం లెదర్ ఎండ్ కలిగి ఉంటాయి. Vivo X90 HDR10+తో 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేతో పాటు 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. సున్నితమైన స్క్రోలింగ్‌తో ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. MediaTek డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో వస్తుంది.

Read Also : Vivo T2 5G Series : భారత్‌కు వివో T2 5G సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Vivo X80 సిరీస్ పాత ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ చిప్‌ను అందిస్తోంది. భారతీయ మోడళ్లలో Snapdragon 8 Gen 2 SoCని కూడా అందించనుంది. మీడియాటెక్ ప్రాసెసర్‌తో కొత్త Vivo ఫోన్‌లను రిలీజ్ చేయడం వెనుక కారణం అసలు కారణం లేకపోలేదు. లాంచ్ ఈవెంట్‌కు నెలల ముందు చిప్ అందుబాటులో లేదు. అందుకే, మరో హై-ఎండ్ చిప్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. Qualcomm గత ఏడాది నవంబర్ 16న కొత్త ఫ్లాగ్‌షిప్ చిప్‌ను ఆవిష్కరించింది. Vivo లాంచ్ ఈవెంట్ నవంబర్ 22న చైనాలో జరిగింది.

Vivo X90 Series Launch (Photo : Vivo)

హుడ్ కింద తగినంత పెద్ద 4,810mAh బ్యాటరీ యూనిట్ ఉంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందిస్తుంది. స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి, aptX HDకి సపోర్టు, క్వాలిటీ సౌండ్, Hi-Res ఆడియోను అందిస్తుంది. ఫోటోగ్రఫీ పరంగా చూస్తే.. Vivo X90 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. OIS, EISలకు సపోర్టుతో 50-MP IMX866 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. 2x ఆప్టికల్ జూమ్‌తో 12-MP పోర్ట్రెయిట్ సెన్సార్, 12-MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో కలిసి ఉంటుంది. ముందు భాగంలో 32-MP స్నాపర్ ఉంది.

Vivo X90 Pro విషయానికొస్తే.. దాదాపు 6.78 అంగుళాల సైజు, 2K రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2160Hz PWM, HDR10+ 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 9200 చిప్‌సెట్, 4,870mAh బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టును అందించింది.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. Hi-Res ఆడియోకు aptX-HDకి సపోర్టు అందిస్తుంది. వెనుకవైపు OIS, EISతో కూడిన 50-MP IMX866 ప్రైమరీ సెన్సార్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. f/1.6 ఎపర్చరు, 2x ఆప్టికల్ జూమ్‌తో 50-MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో వస్తుంది. సెటప్‌లో 12-MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 32-MP సెన్సార్ కూడా అందిస్తుంది.

Read Also : AI ChatGPT : భవిష్యత్తులో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే ఆధిపత్యమా? అంటే.. ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందంటే?

ట్రెండింగ్ వార్తలు