Tamil Nadu : జయలలితకు నివాళి, శశికళ కంటతడి

జయలలిత సమాధి దగ్గర శశికళ నివాళులర్పించారు. ఈ సందర్భంగా..ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో కంటతడి పెట్టారు.

VK Sasikala Emotional : తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు చిన్నమ్మ. పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. నేనొస్తున్నా అంటూ ఇప్పటికే కేడర్‌ను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు శశికళ. జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించారు. ఈ సందర్భంగా..ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో కంటతడి పెట్టారు. అంతకుముందు..ఆమె కారుపై అన్నాడీఎంకే జెండాలతో స్మారకం వద్దకు వెళ్లడం విశేషం. జయ సమాధిని పుష్పాలతో అలకంరించారు. ఈ సందర్భంగా..శశికళకు అన్నాడీఎంకే జెండాలతో స్వాగతం పలికారు.

Read More : VK Sasikala : అమ్మ సమాధి వద్దకు చిన్నమ్మ.. రీఎంట్రీపై కీలక ప్రకటన చేస్తారా?

జయలలిత మరణం తర్వాత శశికళ అక్రమార్జన, అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత… విడుదలవుతూనే అన్నాడీఎంకే పార్టీలో కలకలం రేపారు. పార్టీ పగ్గాలు చేపడతానంటూ ప్రకటించి మద్దతుదారుల్లో ఉత్సాహం రేకెత్తించారు. బెంగళూరు జైలు నుంచి చెన్నైకు భారీ ఊరేగింపుతో వచ్చారు. కానీ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే  హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ చిన్నమ్మ రీఎంట్రీ ఇవ్వనుండడం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Read More : Nihang : సింఘు సరిహద్దు హత్య, మేమే చంపామన్న నిహంగాలు

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో తమిళ రాజకీయాల్లో శశికళకు మళ్లీ స్పేస్‌ దొరికింది. దీంతో పొలిటికల్‌ గేమ్‌లో సక్సెస్‌ అయ్యేందుకు స్ట్రాటజీ రెడీ చేసుకున్నారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి నాయకత్వంపై నమ్మకం లేని నేతలు… శశికళ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది చివరినాటికి ముగించాల్సి ఉంది. అందుకే ఈలోపు పార్టీని తన గ్రిప్‌లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నమ్మ. శశికళ రాకతో తమిళనాట అన్నాడీఎంకే పార్టీకి పూర్వవైభవం వస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు