Bloating And Gas : వేసవిలో ఈ ఆహారాలు తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు తెలుసా ?

పాలకూరలో నీటిలో కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్‌ అపానవాయువును తగ్గిస్తుంది. ఈ సీజన్‌లో పాలకూర ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Bloating And Gas : వేసవిలో మండుతున్న ఎండలు మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తాయి. వేసవిలో, మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గించడానికి శక్తి ఖర్చవుతుంది. ఇది జీర్ణక్రియ వంటి ఇతర శరీర ప్రక్రియల నుంచి శక్తిని మళ్లిస్తుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్‌, అపానవాయువులు వంటి జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో, ఆకలి తక్కువగా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది, కొంచెం తిన్నా కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

శారీరక శ్రమ లేకపోవడం, తక్కువ నీరు తాగడం, ఆహారంలో ఫైబర్ తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో గ్యాస్, ఉబ్బరానికి కారణమౌతుంది. వేసవి కాలంలో జీర్ణ సమస్యలను దూరం చేయాడాని మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి డైట్‌ తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాలు ;

పుచ్చకాయ ; వేసవికాలంలో పచ్చకాయలు ఎక్కువగా దొరుకుతాయి. పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. ఈ సీజన్‌లో పుచ్చకాయ తరచుగా తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ సమస్య దూరం అవుతుంది. పుచ్చకాయలో ఉండే పొటాషియం ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలను నివారణకు సహాయపడుతుంది.

పెరుగు ; పెరుగులో లాక్టోబాసిల్లస్, అసిడోఫిలస్‌, బైఫిడస్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. రోజుకు ఒక కప్పు పెరుగుతింటే జీర్ణక్రియ సాఫీగా జరిగి, ఉదర సంబంధిత సమస్యలను నయం అవుతాయి. గ్యాస్‌, కడుపు ఉబ్బరాన్ని తగ్గుతాయి. భోజనం తర్వాత పెరుగు తింటే జీర్ణ వ్యవస్ధ ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు జీర్ణ ప్రక్రియను వృద్ధి చేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది.

READ ALSO : Summer Health Problems : వేసవి కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవే?

పాలకూర ; పాలకూరలో నీటిలో కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్‌ అపానవాయువును తగ్గిస్తుంది. ఈ సీజన్‌లో పాలకూర ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే‌, పాలకూర పచ్చిగా తింటే అజీర్తికి దారి తీస్తుంది. కాబట్టి ఉడికించుకుని తీసుకోవటం మంచిది.

పసుపు ; పసుపు అన్ని జీర్ణ సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది పిత్త రసం ఉత్పత్తిని పెంచుతుంది. కొవ్వులను బాగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వంటల్లో పసుపు చేర్చుకోవటం ద్వారా వేసవి కాలంలో కొన్ని రకాల వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు.

నిమ్మ కాయ ; పొట్ట సమస్యలను నివారించడానికి నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. వేసవి కాలంలో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. నిమ్మరసం పేగులను శుభ్రం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది.

కీర దోస ; కీరాదోసలో సిలికా, విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పోషాకలు నీరు నిలుపుదలని నివారిస్తాయి. కడుపు ఉబ్బరాన్ని దూరం చేస్తాయి. కీర దోసలోని పోషకాలు పేగుల పనితీరు మెరుగుపరచి, జీర్ణసమస్యలను తొలగిస్తాయి. కీరాలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.

పైనాపిల్‌ ; అనసపండులో 85% నీరు ఉంటుంది. జీర్ణ ఎంజైమ్‌లు కూడా ఉంటాయి. జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది. పైనాపిల్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ సీజన్‌లో అనాసపండు తింటే కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దరిచేరవు.

సోంపు గింజలు ; సోంపు గింజలలో ఉండే నూనెలు జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. గ్యాస్, అపానవాయువు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. భోజనం తర్వాత సోపు గింజలను నమలడం మంచిది.

ట్రెండింగ్ వార్తలు