Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకొంటే?

రక్తంలోని వ్యర్థాలను, అధికంగా ఉన్న నీటిని కిడ్నీలు వడపోసి మూత్రాన్ని తయారుచేస్తాయి. మూత్రాశయం కొంతవరకు నిండగానే మూత్రం పోయాలనే భావన కలుగుతుంది.

Urine : శరీరంలో పేరుకుపోయిన వ్యార్థాలను కిడ్నీలు ఫిల్టర్‌ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అందుకే బాగా నీరు తాగుతూ, మూత్ర విసర్జన క్లియర్‌గా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని నిపుణులు చెబుతుంటారు. మూ త్రం వస్తున్నా కొన్నిసార్లు విసర్జనకు సదుపాయాలు లేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకొంటే ఇబ్బందేమీ ఉండదు. కానీ తరచూ ఆపుతుంటే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. వాష్‌ రూమ్స్‌ లేకపోవడంతో మూత్ర విసర్జన కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా మారుతుంటుంది. ఇలా చేస్తే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.

రక్తంలోని వ్యర్థాలను, అధికంగా ఉన్న నీటిని కిడ్నీలు వడపోసి మూత్రాన్ని తయారుచేస్తాయి. మూత్రాశయం కొంతవరకు నిండగానే మూత్రం పోయాలనే భావన కలుగుతుంది. అయితే కొందరు అదేపనిగా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకొంటూ ఉంటారు. దీంతో మూత్రాశయం సాగి పెద్దగా అవుతుంది. అదే సమయంలో మూత్రమార్గంలో మూత్రాన్ని పట్టి ఉంచే కండర వలయాలూ సాగుతాయి. దీంతో వీటి సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఇది క్రమంగా మూత్రం లీకవటానికి దారితీస్తుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

కొందరికి దగ్గినా, తుమ్మినా దుస్తుల్లోనే మూత్రం పడొచ్చు. మూత్రాశయం బాగా సాగితే విసర్జన సమయంలో పూర్తిగా ఖాళీ అవ్వదు కూడా. ఇది లోపల హానికారక బ్యాక్టీరియా పెరగటానికీ వీలు కల్పిస్తుంది. ఇలా తరచూ ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు.మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంది. కనీసం 2 గంటలకు ఒకసారైనా మూత్ర విసర్జన చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు