Theatrical Movies : ఈ వారం తెలుగులో రిలీజ్ అయ్యే థియేట్రికల్ సినిమాలు ఇవే..

August fourth week theatrical releasing Movies king of kotha Gandeevadhari Arjuna Bedurlanka Boys Hostel

Theatrical Movies : గత వారం తమిళ్ డబ్బింగ్ రజినీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) సినిమా భారీ హిట్ అవ్వగా మెగాస్టార్ భోళాశంకర్(Bholaa Shankar) మాత్రం నిరాశపరిచింది. ఈ వారం మీడియం సినిమాలు ఉన్నా అన్ని మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి.

ఆగస్ట్ 24న యాక్షన్ లవర్స్ కోసం కింగ్ ఆఫ్ కొత్త(King of Kotha) మూవీ రిలీజ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా 50 కోట్లకుపైగా బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ ఇంటెన్స్ మూవీ ఆగస్ట్ 24న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది.

వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఇంటెన్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది గాండీవధారి అర్జున. వరుణ్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నింటి కంటే పవర్ ఫుల్ సబ్జెక్ట్ గా వస్తున్న గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna) హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో, ఎలివేషన్ తో తెరకెక్కింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 25న గ్రాండ్ గా ధియేటర్లోకొస్తోంది.


సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరో కార్తికేయ(Karthikeya) ఈ సారి రొటీన్ సినిమా కాకుండా సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉండే సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారు. ఇంట్రస్టింగ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా, యుగాంతం ఆధారంగా బెదుర్లంక 2012(Bedurlanka) సినిమా ఆగస్ట్ 25న ధియటేర్లోకొస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ ఇంట్రస్ట్ క్రియేట్ చేశాయి. ఈ సారి హిట్ గ్యారంటీ అని కార్తికేయ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్.

విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ సినిమా జనవరి 25న రిలీజ్ కాబోతుంది.

కన్నడలో హిట్ అయిన హాస్టల్ హుద్గురు సినిమాని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో ఆగస్టు 26న రిలీజ్ చేస్తున్నారు.

దక్ష, మహానటులు అనే మరో రెండు చిన్న సినిమాలు ఆగస్టు 25న రిలీజ్ కాబోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు