Mr Pregnant Collections : వరుసగా సినిమాలు చేస్తున్న బిగ్బాస్ ఫేమ్ సోహైల్ (Syed Sohel) ఆగస్టు 18న మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. రూపా కొడవాయుర్(Roopa Koduvayur) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భార్యకి వచ్చే ప్రెగ్నెన్సీని తను తీసుకొని ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ గా మారితే ఏమైంది, మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ఎలాంటి పరిస్థితులని చూశాడు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమాలో కామెడీతో పాటు అమ్మ గొప్పతనం, మాతృత్వం, ఎమోషనల్ సీన్స్, ప్రెగ్నెన్సీ మహిళల కష్టాలు అన్ని చూపించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. ఎమోషనల్ మ్యూజిక్, సాంగ్స్ కూడా బాగుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. దీంతో సినిమా మంచి విజయం సాధించింది.
Gadar 2 : బాలీవుడ్లో మరో భారీ హిట్.. 400 కోట్లు కలెక్ట్ చేసిన సన్నీ డియోల్ గదర్ 2..
మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా నాలుగు రోజుల్లోనే 4.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. నిన్నటితో కలిపి 5 కోట్లకు చేరింది. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ లో రావడం అంటే మంచి విజయం సాధించినట్టే. అయితే సినిమా రిలీజ్ రోజు ప్రభాస్ యోగి, ధనుష్ రఘువరన్ Btech సినిమాలు రీ రిలీజ్ కావడంతో మొదటి రోజు కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి. హిట్ టాక్ రావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో తర్వాత సినిమాకి కలెక్షన్స్ పెరిగాయి. ఇటీవల ఇలా కొత్త కొత్త కథలతో వచ్చి చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. వాటిల్లో సోహైల్ మిస్టర్ ప్రగ్నెంట్ కూడా చేరింది.
The BLOCKBUSTER DELIVERY is winning hearts all over❤️#MrPregnant grosses 4.6 crores at the Box Office in 4 days💥
Book your tickets now and experience this emotional ride in the theatres❤️🔥
–https://t.co/EctyTTQRpZ@RyanSohel @RoopaKoduvayur @SVinjanampati @actorbrahmaji… pic.twitter.com/ZYE8nfgKlH— Ramesh Bala (@rameshlaus) August 22, 2023