Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాలీవుడ్ రీమేక్‌.. బడా నిర్మాణ సంస్థల పోటీ..

బాలీవుడ్ లో రీమేక్ అవ్వడానికి సిద్దమవుతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ. ఈ రీమేక్ కోసం..

Miss Shetty Mr Polishetty is going to remake in Bollywood

Miss Shetty Mr Polishetty : అనుష్క శెట్టి (Anushka Shetty), న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోహీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు డైరెక్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మౌత్ టాక్ తో మెల్లిమెల్లిగా ఆడియన్స్ లోకి వెళ్లిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ 40 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తుంది.

Actor Rajinikanth: చంద్రబాబును కలిసేందుకు రజనీకాంత్ రాజమండ్రి జైలుకు వస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన తలైవా

ఇక మూవీ సూపర్ హిట్ అవ్వడంతో నిన్న (సెప్టెంబర్ 16) సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించారు. కాగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన అన్ని భాషల్లో మంచి విజయానే అందుకుంది. ఇక అన్ని చోట్ల మంచి హిట్ టాక్ రావడంతో ఈ మూవీని హిందీలో కూడా తెరకెక్కించేందుకు ఫిలిం మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి రెండు బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం.

Vijay Antony : రెహమాన్ కాన్సర్ట్ వివాదంలోకి విజయ్ ఆంటోనీ.. పరువు నష్టం దావా వేస్తాను అంటూ..

యశ్ రాజ్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్ ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మరి చివరికి ఈ రైట్స్ ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. ఇక ఈ రీమేక్ లో కూడా ఏ హీరో నటించబోతున్నాడు అనే దాని పై కూడా ఆసక్తి నెలకుంది. కాగా ఈ మూవీ స్టోరీ ప్రస్తుత జనరేషన్స్ లవ్ స్టోరీతో తెరకెక్కించారు. అనుష్క ఒక ఫేమస్ మాస్టర్ చెఫ్ పాత్రలో, నవీన్ స్టాండప్ కమెడియన్ పాత్రలో నటించి అలరించారు.

 

ట్రెండింగ్ వార్తలు