Bedurulanka 2012 Trailer : రామ్ చరణ్ చేతులు మీదగా రిలీజైన బెదురులంక 2012 ట్రైలర్..

కార్తికేయ, నేహా శెట్టి నటిస్తున్న బెదురులంక 2012 ట్రైలర్ ని రామ్ చరణ్ రిలీజ్ చేశాడు.

Ram Charan releases Kartikeya Neha Shetty Bedurulanka 2012 Trailer

Bedurulanka 2012 Trailer : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ (Karthikeya) ప్రస్తుతం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, అండ్ టీజర్ మూవీ పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో తాజాగా మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) లాంచ్ చేశాడు.
Celebrity Look : అందాల భామల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. వారసులతో స్టార్ హీరోల జెండా వందనం..

2012 సమయంలో యుగాంతం రాబోతుంది అంటూ ఒక రూమర్ ప్రపంచం అంతటా మారుమోగిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఇంటర్నేషనల్ నుంచి మన నేషనల్ మీడియాలు కూడా దాని డెబిట్స్ నడిపారు. ఆ రూమర్ పై పలు హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే రూమర్ ని బేస్ చేసుకొని కామెడీ నేపథ్యంతో బెదురులంక చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ కథ మొత్తం గోదావరి బెదురులంక గ్రామస్తులు చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

Amy Jackson : ఇండియా వంటి దేశం మరెక్కడా ఉండదు.. అమీ జాక్సన్ ఎమోషనల్ పోస్ట్..
కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. అజయ్ ఘోష్, సత్య, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను.. తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ నెల (ఆగష్టు) 25న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. RX100 తరువాత కార్తికేయకి సరైన హిట్టు పడలేదు. ఈ చిత్రంతో మరి కోా బ్లాక్ బస్టర్ ని అందుకుంటాడా? లేదా? చూడాలి.

ట్రెండింగ్ వార్తలు