Adipurush: ఆదిపురుష్‌తో పోటీకి సై అంటోన్న వారసుడు..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆదిపురుష్ సినిమాను ఢీకొట్టేందుకు మరో స్టార్ హీరో కూడా రెడీ అవుతున్నాడట.

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Adipurush Teaser Poster: ‘ఆదిపురుష్’ టీజర్ పోస్టర్.. రాముడిగా ప్రభాస్ ఎంట్రీ.. టెర్రిఫిక్!

కాగా, సంక్రాంతి బరిలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను ఢీకొట్టేందుకు మరో స్టార్ హీరో కూడా రెడీ అవుతున్నాడట. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవగా, ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తోంది.

Vaarasudu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!

మరి నిజంగానే సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు ఢీకొంటాయా, లేక ఏదైనా సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకుంటుందా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆదిపురుష్ సినిమా మైథలాజికల్ వండర్‌గా రానుండగా, వారసుడు సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడితే ఏ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు