Flash Floods : హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి పెరిగిన మృతుల సంఖ్య

భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఉత్తరాఖండ్‌లోని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 81 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారిని రక్షించడానికి, పలుచోట్ల ఇళ్లు కూలిన కారణంగా మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి....

Flash Floods

Flash Floods : భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఉత్తరాఖండ్‌లోని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 81 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారిని రక్షించడానికి, పలుచోట్ల ఇళ్లు కూలిన కారణంగా మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. (rain fury in Himachal, Uttarakhand) హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా మృతుల సంఖ్య బుధవారం నాటికి 71కి చేరుకుంది. ఆదివారం రాత్రి నుంచి మొత్తం 57 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఓంకార్ చంద్ శర్మ తెలిపారు.

Texas woman arrest : జడ్జీనే చంపేస్తానని బెదిరించిన టెక్సాస్ మహిళ అరెస్ట్

సిమ్లాతో సహా పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సమ్మర్‌హిల్‌లో ఇప్పటి వరకు 13, ఫాగ్లీలో ఐదు, కృష్ణానగర్‌లో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడతాయనే భయంతో కృష్ణానగర్‌లోని దాదాపు 15 ఇళ్లను ఖాళీ చేయించి కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత 24 గంటల్లో కాంగ్రా జిల్లాలోని ఇండోరా,ఫతేపూర్ సబ్ డివిజన్లలోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 1,731 మందిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్ నిపున్ జిందాల్ తెలిపారు.

Madhya Pradesh : ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా మళ్లీ బాలికపై నిందితుడి అత్యాచారం

వాయుసేన హెలికాప్టర్లు, ఆర్మీ సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్ సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించే ఆపరేషన్ కొనసాగుతోందని జిందాల్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ సంవత్సరం రుతుపవనాల 54 రోజుల్లో ఇప్పటికే 742 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడిన ఉత్తరాఖండ్‌లోని లక్ష్మణ్ ఝూలాలోని రిసార్ట్‌లో శిథిలాల నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి రెండు మృతదేహాలు, బుధవారం మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని పౌరిలోని ఎస్‌ఎస్‌పి కార్యాలయం తెలిపింది.

Rahul Gandhi : డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాహుల్ గాంధీ

ఈ నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో ఉత్తరాఖండ్‌లో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మృతుల సంఖ్య 10కి చేరింది. పౌరీ-కోట్‌ద్వార్-దుగడ్డ జాతీయ రహదారిపై అంసౌర్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిని పిపాల్‌కోటి భరెన్‌పాని సమీపంలో కొట్టుకుపోయినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు.

Boat Capsizes : కేప్‌ వెర్డే వద్ద సముద్రంలో బోల్తా పడిన పడవ…63మంది మృతి

పాంగ్,భాక్రా డ్యామ్‌ల నుండి అదనపు నీటిని విడుదల చేయడంతో హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలు మునిగిపోవడంతో పంజాబ్ రాష్ట్రం వరదలతో సతమతమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వరదల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. భాక్రా, పాంగ్ డ్యామ్‌లలో నీటి మట్టాలు 1,677 అడుగులు, 1,398 అడుగులకు చేరాయని సీఎం పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు