Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. పుట్‌పాత్‌పైకి దూకి తప్పించుకున్న సీఎం

బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వాకింగ్ చేస్తున్న సమయంలో బైక్‌పై వ్యక్తులు భద్రతా సిబ్బందినిదాటి సీఎంకు అత్యంత సమీపంలోకి వచ్చారు. దీంతో నితీష్ పుట్‌పాత్‌పైకి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Nitish Kumar

Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్‌ (Bihar CM Nitish Kumar) కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం నితీష్ మార్నింగ్ వాక్‌ (morning walk) కు బయలుదేరారు. తన నివాసానికి సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై భద్రతా సిబ్బందిని దాటి నితీష్‌కు అత్యంత సమీపంలోకి వచ్చి ఢీకొట్టేంత పనిచేశారు. వెంటనే అప్రమత్తమైన నితీష్ పక్కనే ఫుట్‌పాత్ పైకి దూకారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైకర్లను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.

Nitish Kumar: వన్‌ ఆన్‌ వన్‌ పేరుతో.. నితీశ్ కుమార్ సరికొత్త వ్యూహం.. వర్కవుట్ అవుతుందా?

బైక్‌పై ఉన్నఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఎం భద్రతా సిబ్బంది విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో సీసీ‌టీవీ పుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌పై ప్రయాణిస్తున్నవారు పొరపాటున జరిగిందని చెప్పినట్లు సమాచారం. దీంతో సీసీటీవీ పుటేజ్‌ల ఆధారంగా పొరపాటున జరిగిందా, కావాలనే ఇలా చేశారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌పై ఉన్నవారు ఎవరు, స్థానికులా, బయటి వ్యక్తులా అనే విషయాలు తెలియాల్సి ఉంది. తాజా ఘటనపై అధికారులెవరూ స్పందించలేదు. విచారణ అనంతరం ఈ ఘటనపై ఎస్ఎస్పీ మీడియాకు వివరించే అవకాశాలు ఉన్నాయి.

Ghulam Nabi Azad: విపక్షాల ఐక్యత అంత ఈజీకాదు.. సీఎం జగన్ గురించి ప్రస్తావిస్తూ గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు ఘటన అనంతరం ఎస్‌ఎస్‌జీ కమాండెంట్, పట్నా ఎన్ఎస్పీని సీఎం నితీష్ కుమార్ తన నివాసానికి పిలిపించి సమావేశం అయ్యారు. ఈ విషయంలో భద్రతా సిబ్బంది లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలాఉంటే ఘటన జరిగిన రోడ్డులోనే మాజీ సీఎం రబ్రీదేవి సహా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల నివాసాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు