Ghulam Nabi Azad: విపక్షాల ఐక్యత అంత ఈజీకాదు.. సీఎం జగన్ గురించి ప్రస్తావిస్తూ గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిపక్ష పార్టీల సమావేశంకు తనను ఆహ్వానించలేదని గులాం నబీ ఆజాద్ చెప్పారు.

Ghulam Nabi Azad

Ghulam Nabi Azad: 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని బీజేపీయేతర పార్టీలన్ని ఏకతాటికి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీయేతర రాష్ట్రాల్లోని పలు పార్టీలను ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విపక్షాల కూమిటీపై డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. విపక్షాల కూటమికి మీకు ఆహ్వానం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి ఆహ్వానం లేదని చెప్పారు. అయితే, విపక్షాల కూటమి అనేది అంత ఈజీ అయిన విషయం కాదని చెప్పారు. ఈ సమావేశాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

Early Lok Sabha Polls: ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీయేతర పార్టీలన్ని కలవడం పెద్ద సమస్యకాదు, కానీ, ఎన్నికల సమయంలో సీట్ల పంపకం విషయంలో పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఆ సమయంలో అన్ని పార్టీలు తమతమ పంతాలు వీడితే విపక్షాల కూటమి విజయానికి అవకాశం ఉంటుందని అన్నారు. పొత్తు ధర్మలో 50-50 లేదా 60-40 నిష్పత్తిలో సీట్లను పంచుకోవాల్సి ఉంటుందని, అయితే ఇది అంతతేలిగ్గా జరిగేపనికాదని ఆజాద్ అన్నారు.

Manipur Minister Residence Burned: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ..మంత్రి ఇల్లు దహనం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మినహా మరే రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేకూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్ విపక్షాల కూటమిలో చేరితే కాంగ్రెస్ పార్టీకి సీట్లు కేటాయించగలరా? అని ఆజాద్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్, సీపీఐ కూటమికి ఒక్క ఎమ్మెల్యేకూడా లేరు. అలాంటప్పుడు విపక్షాల పొత్తు ధర్మలో మమత బెనర్జీకి కాంగ్రెస్ కు టికెట్లు కేటాయించడం వల్ల వచ్చే లాభం ఏమిటి? మిగిలిన రాష్ట్రాల్లో మమతా అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇస్తుందా? అవన్నీ సాధ్యంకానివే అని ఆజాద్ అన్నారు.

Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా.. బండి సంజయ్ ఏమన్నారంటే..?

విపక్షాల కూటమిలోని పార్టీలు తమ స్వలాభాలు చూసుకోకుండా కూటమి ధర్మంను పాటిస్తూ ముందుకెళ్తే బీజేపీని ఎదుర్కొనేందుకు సాధ్యమవుతుందని, అప్పుడు కూటమి విజయవంతం అవుతుందని ఆజాద్ చెప్పారు, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షాల కూటమి విజయవంతం అవుతుందని నేను భావించడం లేదని ఆజాద్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు