Chandrashekhar Azad: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు.. ఆసుపత్రికి తరలింపు

దుండగులు హరియాణాకు చెందిన కారు నంబరు ప్లేట్ తో అక్కడకు వచ్చారు.

Chandrashekhar Azad

Chandrashekhar Azad – Bhim Army : భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ పై  దుండగులు కాల్పులు జరిపాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని సహరాన్‌పూర్ (Saharanpur) లో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రశేఖర్ ఆజాద్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సహరాన్‌పూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వచ్చిన సమయంలో ఈ కాల్పులు జరిగాయి. దుండగులు హరియాణాకు చెందిన కారు నంబరు ప్లేట్ తో అక్కడకు వచ్చారు. దుండగుల కాల్పుల్లో చంద్రశేఖర్ ఆజాద్ కు గాయాలయ్యాయి.

” చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్ లో ఉన్న సమయంలో దుండగులు కారులో వచ్చి, కాల్పులు జరిపారు. చంద్రశేఖర్ ఆజాద్ పరిస్థితి నిలకడగానే ఉంది. సీహెచ్‌సీ ఆసుపత్రికి తీసుకెళ్లాం. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు ” అని పోలీసు అధికారులు చెప్పారు.

తనపై కాల్పులు జరిపింది ఎవరో తనకు తెలియదని, కానీ, తన పార్టీకి చెందిన వారు వారిని చూశారని చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. ఆసుపత్రిలో ఆయన మాట్లాడారు. దుండగుల కారు సహరాన్‌పూర్ మీదుగా వెళ్లిందని చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో తమ కారులో తన తమ్ముడితో పాటు మరో నలుగురం ఉన్నారని తెలిపారు..

Viral Video: అన్ని గంటలపాటు కష్టపడి ఆటోనడిపితే.. ఇంతే డబ్బు వచ్చింది.. ఎందుకంటే?: ఆటోడ్రైవర్ కన్నీరు

ట్రెండింగ్ వార్తలు