Tamilnadu: అంబేద్కర్, దళితుల మీద కులదూషణలు.. వీహెచ్‌పీ మాజీ నేత అరెస్ట్

కుల దూషణలతో నిండిన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్.అంబేద్కర్‌ను "గుమాస్తా, టైపిస్ట్, ప్రూఫ్ రీడర్" అని ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

RBVS Manian: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, దళిత సామాజికవర్గం మీద వీహెచ్‌పీ మాజీ నేత ఆర్‌బీవీఎస్ మణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై కేసు నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు.

Botsa Satyanarayana: అర్జెంటుగా అధికారంలోకి వచ్చి, గిట్టని వారిపై మీరు..: పవన్ పొత్తు కామెంట్స్‌పై ఏపీ మంత్రులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 11న టీ-నగర్ భారతీయ విద్యాభవన్‌లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో దళితులను కించపరిచేలా ఆర్‌బీవీఎస్ మణియన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ఆధారంగా గురువారం ఉదయం మణియన్‌ను ఆయన నివాసంలోనే అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. తమిళనాడు వీహెచ్‌పీ యూనిట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అయిన మణియన్.. కుల దూషణలతో నిండిన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్.అంబేద్కర్‌ను “గుమాస్తా, టైపిస్ట్, ప్రూఫ్ రీడర్” అని ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

INDIA bloc: ఇండియా కూటమిని వదలని ప్రధాని వివాదం.. మరోసారి నితీశ్ పేరు లేవనెత్తిన జేడీయూ

మణియన్ చేసిన ప్రసంగంలో.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు అందించారని చాలా మంది చెబుతూనే ఉన్నారని, కీర్తిస్తూనే ఉన్నారని, వాస్తవానికి అందుకు అంబేద్కర్ సొంతంగా చేసిందేమీ లేదని అన్నారు. అదంతా స్టెనోగ్రాఫర్ రాశారని, స్టెనోగ్రాఫర్ టైప్ చేసాడని, టైప్ చేసింది సరైనదా కాదా అని మాత్రమే అంబేద్కర్ చూశారని, అదే అంబేద్కర్ కృషంటూ వెటకారంగా విమర్శలు గుప్పించారు. ఇక మణియన్ మీద ఐపీసీ సెక్షన్లు 153, 153A(1)(a), 505(1)(b), 505(2), సెక్షన్లు 3(1)(r), 3(1)(u), ఎస్సీ-ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం 1989లోని సెక్షన్ 3(1)(v) కింద కేసులు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు