CM Siddaramaiah: బెంగళూరు ట్రాఫిక్‭ నియంత్రణ కోసం ఏకంగా తన కాన్వాయ్ మీదే సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది రెండవసారి. గతంలో 2013-18 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పని చేశారు. మళ్లీ ఐదేళ్ల అనంతరం మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.

Karnataka Politics: దేశంలో అత్యంత రద్దీ ఉన్న ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటి. నిత్యం వేలాది మంది వాహనదారులు ఈ ట్రాఫిక్ రద్దీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ట్రాఫిక్ తిప్పల్ని కాసింతైన తగ్గించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్త పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. తనకు కల్పించిన జీరో ట్రాఫిక్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై బెంగళూరు నగర కమిషనర్‭కి సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Papua New Guinea: మోదీకి ఎదురెళ్లి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధానమంత్రి

ఈ విషయమై ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నా వాహనానికి ఇచ్చిన జీరో ట్రాఫిక్ సౌకర్యాన్ని ఉపసంహరించుకోవాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కి తెలియజేశాను. జీరో ట్రాఫిక్‌ కారణంగా రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించి ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన వ్యక్తిగతానికి సంబంధించి సిద్ధరామయ్య తీసుకున్న తొలి నిర్ణయం ఇదే.

Bengaluru rains: వర్ష బీభత్సం.. కారులో చిక్కుకుని ఏపీ మహిళ మృతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా గుర్తింపు

ఇక కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది రెండవసారి. గతంలో 2013-18 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పని చేశారు. మళ్లీ ఐదేళ్ల అనంతరం మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా ఎనిమిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

ట్రెండింగ్ వార్తలు