Yamuna River : ఢిల్లీలో మళ్లీ డేంజర్ మార్కుకు చేరిన యమునా నది

ఢిల్లీలో మళ్లీ యమునా నదికి వరదలు వెల్లువెత్తాయి. యమునా నది నీటి మట్టం మంగళవారం రాత్రి 205.39 మీటర్లకు పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీవర్షాల వల్ల యమునా నదిలో నీటి మట్టం పెరుగుతోందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది....

Yamuna River

Yamuna River : ఢిల్లీలో మళ్లీ యమునా నదికి వరదలు వెల్లువెత్తాయి. యమునా నది నీటి మట్టం మంగళవారం రాత్రి 205.39 మీటర్లకు పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీవర్షాల వల్ల యమునా నదిలో నీటి మట్టం పెరుగుతోందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. ( Delhi Yamuna water level reaches danger mark) ఢిల్లీకి ఎగువన ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో యమునా నదిలో వరదనీరు పోటెత్తింది. దీంతో నది వరదనీటితో ఉప్పొంగుతోంది.

Vrindavan : బృందావన్ ఆలయ సమీపంలో భవనం కూలి ఐదుగురి మృతి

యమునా నది నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. జులై నెలలో యమునాలో వరదనీటి ప్రవాహం డేంజర్ స్థాయికి చేరడంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మళ్లీ పెరుగుతున్న వరదనీటి మట్టంతో లోతట్టుప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. యమునా నది తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ అధికారులు నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు