Karnataka: కర్ణాటకలో మరో వివాదం.. స్వాతంత్ర్య దినోత్సవాన విద్యార్థులతో ‘జై సావర్కర్’ అనిపించిన హెడ్ మాస్టర్

ఇది మరోసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రాజకీయ ఎజెండా అని బీజేపీ ఆరోపించింది. పాఠశాలలో వీర్‌ సావర్కర్‌ గీతాలాపనను ప్రజలు వ్యతిరేకిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉందని మాజీ ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌ అన్నారు.

Savarkar Row: కొంత కాలంగా వివాదాలతో వాడీవేడీగా ఉంటున్న కర్ణాటకలో మరో వివాదం తలెత్తినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఒక పాఠశాలలో విద్యార్థుల చేత ‘సావర్కర్ కీ జై’ అంటూ స్వయంగా హెడ్ మాస్టరే నినాదాలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్ తాలూకాలో ఉన్న మాంచి ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, విద్యార్థుల చేత పాఠశాల మైదానంలో వరుసలో ఉంచి ‘జై సావర్కర్’ అని నినాదాలు చేయించారు.

Rajasthan Politcis: రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజేను పక్కన పెట్టేసిన బీజేపీ.. ఆమె లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నారా?

అయితే ఈ ఘటనలపై కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు (స్కూల్ అడ్మినిస్ట్రేషన్) మా పిల్లల చేత ఈ నినాదాలు చేయిస్తారు? ఇలాంటి ఘటనలు జరగకూడదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పాఠశాల హెచ్ మాస్టర్ క్షమాపణ చెప్పారు.

2024 Elections: ఓడిపోయిన సీటు నుంచే రాహుల్ గాంధీ పోటీ.. ఈసారైనా స్మృతి ఇరానీని ఓడిస్తారా?

‘‘వీర్ సావర్కర్ కి జై అనడం తప్పే. నేను క్షమాపణలు చెప్పాను’’ అని హెచ్ మాస్టర్ విమల తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని, అది వైరల్‌గా మారిందని ఆమె పేర్కొన్నారు. దీన్ని వైరల్ చేయడంతో విఠల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయింది. మరోవైపు, ఇది మరోసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రాజకీయ ఎజెండా అని బీజేపీ ఆరోపించింది. పాఠశాలలో వీర్‌ సావర్కర్‌ గీతాలాపనను ప్రజలు వ్యతిరేకిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉందని మాజీ ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు