Burnt Alive : షాకింగ్.. విద్యుత్ తీగ తగిలి వృద్ధురాలు సజీవదహనం.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో

వృద్ధురాలు మంటల్లో సజీవ దహనం అయిన ఘటనను కళ్లారా చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Burnt Alive

Burnt Alive

Uttar Pradesh – Burnt Alive : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగ తగిలి ఓ వృద్ధురాలు సజీవ దనహనమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

80ఏళ్ల వృద్ధురాలు పొరపాటున ఇంటి బాల్కనీలో హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకింది. అంతే, అక్కడికక్కడే ఆమె సజీవ దహనం అయింది. వృద్ధురాలు మంటల్లో కాలిపోతుండగా స్థానికులు వీడియో తీశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వృద్ధురాలు మంటల్లో సజీవ దహనం అయిన ఘటనను కళ్లారా చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Kerala Road Accident : రోడ్డు దాటుతున్నారా? బీకేర్ ఫుల్.. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

వృద్ధురాలు తన ఇంటి బాల్కనీలో నిల్చుని ఉంది. తన మనవడికి ఫోన్ చేసే ప్రయత్నంలో ఆమె ఉంది. ఈ క్రమంలో పొరపాటున ఆమె 11వేల వోల్టుల హైటెన్షన్ విద్యుత్ వైర్ ను తాకింది. అంతే, ఘోరం జరిగిపోయింది. వృద్ధురాలు విద్యుదాఘాతానికి గురైంది. ఆ మరుక్షణమే మంటలు చెలరేగడం, వృద్ధురాలు సజీవ దహనం అవడం జరిగిపోయాయి. స్పాట్ లోనే ఆమె మరణించింది.

Also Read..Sri Sathyasai District : బాబోయ్.. ఒక్కసారిగా కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం, షాకింగ్ వీడియో

కాగా, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఒక ప్రాణం పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు చాలా ప్రమాదకరం అని తెలిసినా ఇంటి ముందు చేతికి అందేలా వైర్లను ఉంచడం క్షమించరాని నేరం అంటున్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి.. ఇప్పటికైనా ఇళ్ల నుంచి దూరంగా విద్యుత్ వైర్లను జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇంటి ముందు విద్యుత్ వైర్లు ఉంటే, ఆ ఇళ్లలో ఉండే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు