5G in India: వచ్చే ఏడాది డిసెంబర్ వరకు అంటూ.. 5జీ సేవలపై వాగ్దానం చేసిన ముకేశ్ అంబానీ

5జీ ప్రారంభమవడంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని ముకేశ్ చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్లాక్‌చైన్, మెటావెర్స్ వంటి 21వ శతాబ్దపు ఇతర టెక్నాలజీల సంపూర్ణ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడానికి 5జీ సేవలు పునాదివంటివని ముకేశ్ తెలిపారు.

5G in India: 2023 డిసెంబరు నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వాగ్దానం చేశారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 5జీ సేవలను ప్రారంభించారు. దీనికి ముందు ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమంలో ముకేశ్ మాట్లాడుతూ దేశంలో 5జీ విస్తరణపై జియో ఆసక్తిగా ఉందని, వచ్చే ఏడాది ముగిసే నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలను 5జీతో అనుసంధానిస్తామని అన్నారు.

5జీ ప్రారంభమవడంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని ముకేశ్ చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్లాక్‌చైన్, మెటావెర్స్ వంటి 21వ శతాబ్దపు ఇతర టెక్నాలజీల సంపూర్ణ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడానికి 5జీ సేవలు పునాదివంటివని ముకేశ్ తెలిపారు.

ఇక ఇదే కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ భారత దేశంలో 5జీ సేవలు ప్రారంభంకావడంతో నవ శకం ప్రారంభం కాబోతోందని అన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న ఏడాదిలో ఇది జరుగుతోందన్నారు. దీంతో దేశంలో నూతన చైతన్యం, నూతన శక్తి, సామర్థ్యాలు మొగ్గ తొడుగుతాయని తెలిపారు.

5G in India: 5జీ లింక్ ఉపయోగించి.. స్వీడన్ నుంచి ఢిల్లీకి కారు నడిపిన ప్రధాని మోదీ

ట్రెండింగ్ వార్తలు