Monkeys, pigeons own properties : కోతులకు 32 ఎకరాల సొంత భూమి .. పావురాల పేరున రూ. కోట్లు విలువ చేసే ఆస్తులు

సాధారణంగా మనుషులకు ఆస్తిపాస్తులుంటాయి. ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు వంటి ఆస్తులుంటాయి. కానీ జంతువులకు, పక్షులకు కూడా సొంతంగా ఆస్తులున్నాయనే విషయం తెలుసా? ఓ గ్రామంమంలో పావుల పేరున కోట్ల రూపాయలు విలువ చేసే భూములున్నాయి. అలాగే మరో గ్రామంలో కోతులకు సొంతంగా భూములున్నాయి.

Monkeys, pigeons own properties

Monkeys, pigeons own properties : సాధారణంగా మనుషులకు ఆస్తిపాస్తులుంటాయి. ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు వంటి ఆస్తులుంటాయి. కానీ జంతువులకు, పక్షులకు కూడా సొంతంగా ఆస్తులున్నాయనే విషయం తెలుసా? ఓ గ్రామంమంలో పావుల పేరున కోట్ల రూపాయలు విలువ చేసే భూములున్నాయి. అలాగే మరో గ్రామంలో కోతులకు సొంతంగా భూములున్నాయి. వినటానికి ఇది కాస్త వింతగా ఉన్నా నిజమే. కొంతమంది తమ పెంపుడు జంతువులకు, అనాధాశ్రమాలకు ఆస్తులు రాసిస్తుంటారు. కానీ గాల్లో ఎగిరుతూ ఎక్కడోక చోట గూడులు కట్టుకుని నివసించే పావురాలకు..చెట్లపై ఎగురుతు దొరికింది తింటూ ఎటు పడితే అటు స్వేచ్ఛగా తిరిగే కోతులకు కూడా సొంత ఆస్తులున్నాయి.. ముందుగా కోతుల ఆస్తుల వివరాలేంటో తెలుసుకుందాం..

మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఉప్లా గ్రామంలో కోతులకు 32 ఎకరాల భూమి ఉంది. సాధారణంగా కోతులు ఇళ్లమీదకు వస్తే తరిమేస్తుంటాం. కానీ ఉప్లా గ్రామ ప్రజలు మాత్రం కోతుల్ని ప్రేమగా చూసుకుంటారు. అవి ఎప్పుడు ఇంటికి వచ్చినా.. వాటికి ఆహారం అందిస్తారు. అంతేకాదు..గ్రామంలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా కోతులకు రకరకాల ఆహారాలు పెట్టి గౌరవిస్తారు.గ్రామ పంచాయతీలోని రికార్డులను పరిశీలించగా కోతుల పేరున 32 ఎకరాల భూమి ఉన్నట్లుగా తెలిసింది. దీని గురించి ఉప్లా గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్‌ మాట్లాడుతూ.. ‘‘భూమి కోతులదేనని పత్రాల్లో స్పష్టంగా ఉందని తెలిపారు. కానీ వీటిని సృష్టించారో..ఈ పత్రాలను ఎప్పుడు రాశారో తెలియదన్నారు.

గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ కోతులు భాగంగా ఉండేవని..గతంలో మా ఉప్లా గ్రామంలో 100 వరకు కోతులు ఉండేవని..కానీ వాటి సంఖ్య బాగా తగ్గిపోయిందని తెలిపారు. కోతుల పేరున ఉన్న ఈ 32 ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు నాటిందని..అక్కడ పాడుబడిన ఇల్లు ఉండేదని..ప్రస్తుతం ఆ ఇల్లు కూలిపోయిందని తెలిపారు.గతంలో గ్రామంలో వివాహాలు జరిగేటప్పుడు తొలుత వానరాలకు బహుమతులు అందించేవారని, ఆ తర్వాతే పెళ్లి పనులు చేసేవారని సర్పంచ్‌ తెలిపారు.

Millionaire Pigeons: పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు, మన ఇండియాలోనే

పావురాలకు కోట్ల విలువ చేసే భూములు..డిపాజిట్లు..
రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలోని జసనగర్ అనే చిన్న పట్టణంలో ఉండే పావురాల పోషణ కోసం ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఆ ట్రస్టుకు కోట్ల విలువ చేసే భూముల్ని రాసిచ్చారు. జసనగర్ పట్టణంలో చాలా ఏళ్ల క్రితం నుంచి పావురాలు నివసిస్తున్నాయి. ఇక్కడి పావురాలను పోషించేందుకు ఏకంగా ఒక ట్రస్ట్ ను నెలకొల్పారు. వాటి పోషణ, సంరక్షణ నిమిత్తం తమ వద్దనున్న ఆస్తులను, భూములను, నగదును పావురాల ట్రస్టుకు రాశారు కొందరు వ్యక్తులు.

పావురాలకు ఆస్తులు రాయడం అనేది ఇక్కడ ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. స్థానికుల కథనం మేరకు దాదాపు దాదాపు 40 ఏళ్ల క్రితం జసనగర్ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు వచ్చిన, ఒక వ్యక్తి తమ పూర్వీకులను ఆదర్శంగా తీసుకుని పావురాలను సంరక్షించేవాడు. వాటి కోసం ఆహారపు గింజలు, త్రాగు నీరు అందించేవాడు. అలా అతని నుంచి మరొకరు ఆదర్శంగా ముందుకువచ్చి పావురాల కోసం ఆహారం సరఫరా చేసేవారు.

అయితే రోజులు గడిచేకొద్దీ పావురాల సంఖ్య కూడా పెరుగుతుండడంతో.. జసనగర్ ప్రజలంతా కూడబలుక్కుని పావురాల ఆహారం కోసం తోచినంత ఇచ్చేవారు. అలా వచ్చిన సొమ్ముని.. సజ్జనరాజ్ జైన్ అనే వ్యక్తి “కబుతరన్ ట్రస్ట్”(పావురాల ట్రస్ట్) అని ట్రస్ట్ ఏర్పాటు చేసి సమయానికనుగుణంగా వాటికీ ఆహారం అందించే విధంగా ప్రణాళిక వేశారు. అలా సంవత్సరాలుగా పావురలపై కోట్ల రూపాయల ఆస్తులు పోగయ్యాయి. దీంతో ఈ పట్టణంలోని పావురాలని లక్షాధికారి పావురాలు అని పిలుస్తున్నారు. మరి ట్రస్ట్ లో ఏమైనా పొరపచ్చాలు ఉండవా అంటే.. ఉండవనే చెబుతున్నారు జసనగర్ ప్రజలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసే రాబడి ఖర్చుల వివరాలను ఎప్పటికప్పడూ దాతలకు చేరవేస్తుంటారు ట్రస్ట్ సభ్యులు.

ట్రెండింగ్ వార్తలు