Hemoprova Chutia : 700 పేజీల భగవద్గీతను బట్ట మీద నేసిన చేనేత కళాకారిణి.. ఒకసారి చూసేయండి

అందరిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంది. అందుకోసం ఏమి చేయాలని ఆలోచించింది. చిన్ననాటి నుంచి తను నమ్ముకున్న వృత్తిలో అద్భుతాలు చేసి చూపించింది. అస్సాం చేనేత కళాకారిణి ప్రయాణాన్ని మీరు చదవండి.

Hemoprova Chutia

Hemoprova Chutia : 700 పేజీల భగవద్గీతను 250 అడుగుల పొడవున్న బట్ట మీద నేసి తనలోని అద్భుతమైన ప్రతిభను ప్రపంచానికి చూపించింది ఓ చేనేత కళాకారిణి. ఆమె అద్భుతమైన ప్రయాణాన్ని మీరు తెలుసుకోండి.

Veena artist Srivani : ‘వీణ’పై ‘వీణా శ్రీవాణి’ ‘డోరేమాన్’ సాంగ్.. ఏ పాటకైనా ఆమె వేళ్లు రాగాలు పలికిస్తాయి..

హెమోప్రోవా చుటియా.. అస్సాంలోని జోర్హాట్‌కి చెందిన చేనేత కళాకారిణి. చిన్నతనం నుంచి నేత పనిని వృత్తిగా మలుచుకుంది. ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించేది. అదీ ఇప్పటి వరకూ ఎవరూ చేయనిది తాను చేయాలనుకుంది. ఆ ఆలోచనల నుంచి అద్భుతాలు రూపుదిద్దుకున్నాయి. 250 అడుగుల పొడవైన క్లాత్ మీద సంస్కృతంలో భగవద్గీతను నేసింది. అందుకు రెండు సంవత్సరాలు పట్టింది. అక్కడితో ఆగలేదు. ఇంగ్లీషు రాకపోయినా అక్షరాలు ముందు పెట్టుకుని ఇంగ్లీషులో సైతం భగవద్గీతను నేసేసింది ఈ కళాకారిణి. అంతేనా.. అస్సామీ పాఠాలను కూడా నేయడం మొదలుపెట్టింది.

Artist amazing woodwork : చెక్కపై అద్భుతాన్ని క్రియేట్ చేసిన ఆర్టిస్ట్ వీడియో వైరల్

చిన్న క్లాత్ మీద ఓ డిజైన్ కుట్టాలంటేనే చాలా ఇబ్బంది పడిపోతాం. రోజులు, వారాలు చేస్తాం. అలాంటిది అన్ని అక్షరాలను అంత పెద్ద క్లాత్‌పై నేయడం అంటే ఎంత సహనం ఉండాలి. హెమోప్రోవా చుటియాలోని సహనం, టాలెంట్, క్రియేటివిటీ ఆమెను అద్భుతమైన చేనేత కళాకారిణిగా ప్రపంచం ముందు నిలబెట్టాయి. చాలామంది అది రాదు.. ఇది రాదు అంటుంటారు.. ఏ పనిలో అయినా మొదటి అడుగు వేయడానికే సంకోచిస్తారు. భాష రాకపోయినా భగవద్గీతను బట్టపై అలవోకగా నేసిన హెమోప్రోవా చుటియా అలాంటి వారికి ఆదర్శమని చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు