Revanth Reddy National Herald : నాడు ఇందిర, నేడు సోనియా.. 2024లో రిపీట్ కాబోతోందన్న రేవంత్ రెడ్డి

1979లో ఇందిరా గాంధీని జైలుకి పంపిస్తే.. ఇందిరా గాంధీకి దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. 1980లో కాంగ్రెస్ ను గెలిపించారు. 2024లో మళ్లీ అదే రిపీట్ కాబోతోంది.

Revanth Reddy National Herald : నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను నెహ్రూ ప్రారంభించారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెల్లదొరలు పత్రికను మూసేసినా దేశం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక పని చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

స్వాతంత్ర్యం తర్వాత నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పుల్లో కూరుకుపోతే.. 90 కోట్ల రూపాయలు వెచ్చించి కాంగ్రెస్ పార్టీ కాపాడుకుందన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న బీజేపీ కుట్రలను ప్రచురిస్తున్న నేషనల్ హెరాల్డ్ ప్రత్రికను మూసేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సుబ్రమణ్య స్వామి కోర్టులో పిటిషన్ వేశారని అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చిందన్నారు.(Revanth Reddy National Herald)

National Herald case : నేషనల్ హెరాల్డ్ కేసుకు FIR కూడా లేదు..అదొక చిత్తుకాగితం : రేవంత్ రెడ్డి

2017లో ఈడీ కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతుందనే భయంతో బీజేపీ కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదు లేకుండానే సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం తప్పు చేసిందంటే ప్రజలు నమ్మరని రేవంత్ రెడ్డి అన్నారు.

National Herald Case: ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కేం సంబంధం..

రూ.5 వేల కోట్లు కావాలంటే.. ఒక్క రోజులో పార్టీకి ఇచ్చే శక్తి పార్టీ క్యాడర్ కు ఉందన్నారు రేవంత్ రెడ్డి. 1979లో ఇందిరా గాంధీని జైలుకి పంపిస్తే.. ఇందిరా గాంధీకి దేశం మొత్తం మద్దతుగా నిలిచిందని, 1980లో కాంగ్రెస్ ను గెలిపించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2024లో మళ్లీ అదే రిపీట్ కాబోతోందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈడీ, సీబీఐ గాంధీ కుటుంబాన్ని ఏమీ చేయలేవు అని రేవంత్ రెడ్డి అన్నారు.

National Herald case: విచార‌ణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ.. ఈ ప్ర‌శ్న‌లు అడిగిన ఈడీ

నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్-50 కింద నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ వివ‌ర‌ణ‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులను కూడా ఈడీ కార్యాలయంలోకి అనుమతించడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఈడీ కార్యాల‌యం ముందు ఆందోళనకు దిగారు. ఈడీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

2014లో ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై అప్పట్లోనే స్టే తెచ్చుకున్నారు. ఈ సంస్థకు సంబంధించిన రూ.64 కోట్లను 2019లో ఈడీ అటాచ్ చేసింది. అలాగే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును సోనియా గాంధీ ఆశ్రయించారు. అప్పట్నుంచి సాగుతున్న ఈ కేసులో తాజాగా సోనియా, రాహుల్‌ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ.5 వేల కోట్లు ఉంటుందని అంచనా.

ట్రెండింగ్ వార్తలు