2000 Rupees Note : మరో నాలుగు రోజులు మాత్రమే.. గడువు పొడగింపుపై ఆర్బీఐ ఏం చెబుతుది..

2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి.

Rs 2000 Notes (Google Image)

Rs 2000 Note Exchange : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19న ఈ ప్రకటన వెలువడింది. అయితే, ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ సూచనల మేరకు సెప్టెంబర్ 1 నాటికి దాదాపు రూ.3.32లక్షల కోట్లు విలువైన రూ.2వేల నోట్లు తిరిగొచ్చాయి. అంటే 93శాతం నోట్లు బ్యాంకులకు చేరాయి. హోల్డర్లు తమ రూ.2000 నోట్లను దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా డిపాజిట్ చేసుకొనే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. ఇందుకోసం ఒకేసారి రూ. 20వేల పరిమితి విధించింది.

Rs 2000 Notes

2 వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ గడువు విధించింది. అయితే, గడువు ముగింపు నాటికి పూర్తిస్థాయిలో 2వేల నోట్లు బ్యాంకులకు చేరే అవకాశం లేదు. దీంతో ఆర్బీఐ మరోసారి నోట్ల మార్పిడి గడువు తేదీని పొడగిస్తుందని ప్రచారం సాగుతోంది. కానీ, ఆర్బీఐ నుంచి మాత్రం అలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు రూ.2000 నోట్ల మార్పిడికోసం ఆర్బీఐ విధించిన గడువుకు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 28న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం. అంటే మరో నాలుగు రోజులే మాత్రమే మిగిలి ఉంది.

Rs 2000 Note Exchange

2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి. 2018 మార్చి 31న అత్యధికంగా 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే, 2023 మార్చి 31న రూ. 3.62లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ చెప్పింది. అయితే, సెప్టెంబర్ 1న నాటికి 3.32లక్షల కోట్లు బ్యాంకులకు చేరాయి.

ట్రెండింగ్ వార్తలు