Supreme Court : సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి, తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

సనాతన ధర్మంపై .. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఉదయనిధి, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Udhayanidhi 'Sanatan Dharma' Supreme Court notice

Udhayanidhi Sanatan Dharma SC notice : సనాతన ధర్మం (Sanatan Dharma)పై .. డీఎంకే నేత,మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), తమిళనాడు ప్రభుత్వానికి (Tamil Nadu govt) సుప్రీంకోర్టు నోటీసులు (Supreme Court notice)జారీ చేసింది. సనాతన్ ధర్మం సామాజిక న్యాయం యొక్క ఆలోచనకు విరుద్ధమని, దానిని నిర్మూలించవలసి ఉంది అంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత వివాదానికి దారి తీశాయో తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 22,2023)న ఉదయనిధితో పాటు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

సనాతన ధర్మాన్ని (Sanatan Dharma)నిర్మూలించాలి అంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించటమే కాకుండా తీవ్ర వివాదానికి దారి తీశాయి. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఉదయనిధిపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అంతేకాదు ఉదయ నిథి తల తెచ్చిస్తే రూ.10కోట్లు నజరానా ఇస్తానంటూ తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. ఇలా ఉదయనిధిపై ఘాటు విమర్శలు, హెచ్చరికలు పెద్ద ఎత్తున వచ్చాయి.

Also Read: మరోసారి సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసిన ఉదయనిధి.. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవకపోవడంపై విమర్శలు

ప్రధాని మోదీ సైతం స్పందిస్తు ఇటువంటి వ్యాఖ్యలు చేసినవారికి గట్టి సమాధానం ఇవ్వాలంటూ సూచించారు. కానీ ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదంటూ స్పష్టం చేశారు. తాజాగా సనానత ధర్మం అంటే ఇదే అంటూ తాజాగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోదీయే ప్రారంభించటాన్ని ప్రస్తావించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసిన ఉదయనిధి ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని దీంట్లోకి లాగారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించలేదని.. ఆమె వితంతువు, గిరిజనురాలైనందున కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆయన అన్నారు. బుధవారం మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన్‌ సూత్రాలను ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించగా..దానికి వ్యతిరేకంగా గళం విప్పడం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Also Read: క్యాబ్‌ డ్రైవర్‌ అకౌంట్లోకి రూ.9వేల కోట్లు .. షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్..!

‘‘నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. కానీ వితంతువు, గిరిజన మహిళ అయిన భారత రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. ఇది సనాతన ధర్మమా? మేము దీనికి వ్యతిరేకంగా మా గొంతును పెంచుతూనే ఉంటాము” అని స్పష్టం చేస్తు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానంటూ మరోసారి వెల్లడించారు ఉదయనిధి. ఈ క్రమంలో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆయనతో పాటు తమిళనాడు ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. కాగా ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలకు తోడు సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా వైరస్, ఎయిడ్స్ వంటిది అంటూ డీఎంకే నేత, ఎంపీ ఎ.రాజా (MP Raja) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు