Booster Shot: రాబోయేది పండుగల సీజన్.. బూస్టర్ డోసు తీసుకుంటేనే రక్షణ.. ప్రజలకు కేంద్రం సూచన

రాబోయే పండుగల సీజన్ సందర్భంగా కోవిడ్ వ్యాప్తి జరగకూడదంటే అర్హులందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కేంద్రం సూచించింది. బూస్టర్ డోసులపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.

Booster Shot: రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని అర్హులందరూ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించింది నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్‌టీఏజీఐ). వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హత కలిగి ఉన్నప్పటికీ చాలా మంది ఇంకా తీసుకోలేదని, తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎన్‌టీఏజీఐ చీఫ్ ఎన్‌కే అరోరా సూచించారు.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే కొద్ది నెలల్లోనే పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వస్తామని ఆయన అన్నారు. ఈ అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బహుశా నాలుగు నెలల్లోనే పూర్తిస్తాయిలో మునుపటి స్థితికి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు బాధ్యతగా ఉంటే కొత్త వేరియెంట్ల నుంచి కూడా రక్షణ పొందొచ్చు. ప్రజలు బూస్టర్ డోసు తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడం వల్లే కేంద్రం ఉచితంగా అందించేందుకు నిర్ణయించింది. దీంతో బూస్టర్ డోసులకు డిమాండ్ పెరిగింది. ప్రైవేటు సంస్థల్లో బూస్టర్ డోసు ఇచ్చినప్పడు రోజుకు రెండు లక్షల వరకు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగేది. ప్రభుత్వం బూస్టర్ డోసు ఉచితంగా అందివ్వడం మొదలుపెట్టిన తర్వాత రోజుకు 25-40 లక్షల మంది బూస్టర్ డోసు తీసుకుంటున్నారు.

Father kills son: దుబాయ్ నుంచి వచ్చిన కొడుకును చంపిన తండ్రి.. కారణమేంటంటే

ప్రస్తుతం దేశంలోని 40,000కుపైగా కేంద్రాల్లో ఉచితంగా బూస్టర్ డోసు అందిస్తున్నాం. ప్రైవేటులో ఆరు శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. అయితే, ఇంకా బూస్టర్ డోసు తీసుకునేలా అవగాహన కల్పించాల్సి ఉంది’’ అని అరోరా అన్నారు. బూస్టర్ డోసుల తర్వాత భవిష్యత్తులో మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ట్రెండింగ్ వార్తలు