Punjab Teen: ఒక్కరోజు కూడా జిమ్‌కు వెళ్లకున్నా.. పుషప్స్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించిన పంజాబ్ కుర్రాడు

పుషప్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాలంటే నెలల తరబడి జిమ్‌లో కసరత్తులు, నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ, డైట్ వంటివి అవసరం. కానీ, ఇవేవీ లేకుండానే ఒక యువకుడు పుషప్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Punjab Teen: ఒక్కరోజు కూడా జిమ్‌కు వెళ్లకున్నా, ఒక పంజాబ్ యువకుడు పుషప్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక్క నిమిషంలో 45 పుషప్స్ చేశాడు. అది కూడా చేతి వేళ్లపై. దీంతో అతడి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

పంజాబ్, గుర్దాస్ పూర్ జిల్లా, ఉమ్రావాలా గ్రామానికి చెందిన కువార్ అమృత్ వీర్ అనే పందొమ్మిదేళ్ల యువకుడు ఈ ఘనత సాధించాడు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ అతడేమీ జిమ్‌కు వెళ్లి, నిపుణుల సమక్షంలో ప్రాక్టీస్ చేయలేదు. తనే సొంతంగా జిమ్ ఎక్విప్‌మెంట్ తయారు చేసుకున్నాడు. ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోలేదు. డైట్ కూడా ఫాలో కాలేదు. ఇంట్లో వాళ్ల అమ్మ చేసే ఆహారం మాత్రమే తీసుకున్నాడు. అయితే, రికార్డు నెలకొల్పాలని నిర్ణయించుకున్న తర్వాత 21 రోజులపాటు వరుసగా ప్రాక్టీస్ చేశాడు. తర్వాత గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో గత ఫిబ్రవరిలో ఒక్క నిమిషంలోపు, 45 పుషప్స్ చేసి రికార్డు సాధించాడు.

Ghulam Nabi Azad: రాహుల్ గాంధీ మంచివ్యక్తే.. కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత లేదు: గులాం నబీ ఆజాద్

దీన్ని పరిశీలించిన కమిటీ, తాజాగా అతడికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో చోటు దక్కినట్లు సర్టిఫికెట్ జారీ చేసింది. దేశంలోని యువతను ఫిట్‌నెస్ విషయంలో ఉత్సాహపరచాలని, వారికి స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే తాను ఈ రికార్డు సృష్టించినట్లు కువార్ చెప్పాడు.

 

ట్రెండింగ్ వార్తలు