Clay Pot Accident On Gas Stove : మట్టికుండలో వంట చేస్తుండగా ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

మట్టికుండలో వంట చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలి. కొత్తగా మొదలుపెట్టేవారు అసలు దానిని ఎలా ఉపయోగించాలో పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రీసెంట్‌గా ఓ ఫుడ్ బ్లాగర్ కుండలో వంట చేస్తుంటే ప్రమాదం జరిగింది.

Clay Pot Accident On Gas Stove

Clay Pot Accident On Gas Stove : గ్యాస్ స్టవ్ మీద మట్టి కుండలో వంట చేస్తుండగా ఓ ఫుడ్ బ్లాగర్ ప్రమాదాన్ని ఎదుర్కున్నారు. దానికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది.

మట్టి కుండలో నీళ్లు..మామంచి ప్రయోజనాలు..

వంట చేసేటపుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు జరుగుతాయి. ఈరోజుల్లో ఎక్కువగా సాంప్రదాయమైన పద్ధతిలో వంట చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. పాత పద్ధతులు తిరిగి మొదలుపెడుతున్నారు. చట్నీలు చేయడానికి రోలు.. వంటలు చేయడానికి కుండలు వాడుతున్నారు. అయితే ఫర్హా ఆఫ్రీన్ (@homely_ccorner) అనే ఫుడ్ బ్లాగర్ మట్టి కుండతో గ్యాస్ స్టవ్‌పై వంట చేసిన తన అనుభవాన్ని పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్లారు. అయితే ఆమె చేసిన ప్రయోగం ప్రమాదంగా మారింది. ‘వంటలో తప్పు జరిగింది. మట్టి కుండతో వంట చేసేటపుడు జాగ్రత్తగా ఉండండి’ అనే శీర్షికతో ఆమె ఓ పోస్ట్ పెట్టారు.

మట్టి కుండ నీళ్లు.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!

మట్టి కుండలో ఓ టీ స్పూన్ నెయ్యి, జీలకర్ర, కరివేపాకులను వేసారు. ఒక్కసారిగా చెలరేగిన మంటతో మట్టికుండ పగిలిపోయింది. స్టవ్ ప్రాంతం అంతా గందరగోళంగా మారింది. అయితే లక్కీగా ఎటువంటి హానీ జరగలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొత్తగా మట్టి కుండతో వంట చేసే వారు పెద్దవారి సలహా అడగాలని.. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు