Viaral Video: బుద్ధిజం కార్యక్రమంలో ‘అంబేద్కర్ 22 ప్రమాణాలు’.. పాల్గొన్న ఢిల్లీ మంత్రి.. హిందుత్వాన్ని అవమానించారంటూ మండిపడుతున్న బీజేపీ

బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఈ ప్రమాణాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు. అంతే, హిందుత్వ భావజాల వ్యక్తులు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. హిందూ ధర్మాన్ని ప్రవీణ్ కుమార్ అవమానించారంటూ ప్రవీణ్ కుమార్‭పై బీజేపీ పెద్ద ఎత్తున ఫైర్ అయింది. అయితే తాను కట్టర్ హిందువునని తర్వాత జరిగిన ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పుకోవడంతో గొడవ సద్దుమనిగింది.

Viaral Video: కొద్ది రోజుల క్రితం తెలంగాణలో అంబేద్కర్ బౌద్ధం తీసుకున్నప్పుడు చేసినప్పటికీ ప్రమాణాలపై పెద్ద చర్చ జరిగింది. అప్పటి ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఈ ప్రమాణాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు. అంతే, హిందుత్వ భావజాల వ్యక్తులు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. హిందూ ధర్మాన్ని ప్రవీణ్ కుమార్ అవమానించారంటూ ప్రవీణ్ కుమార్‭పై బీజేపీ పెద్ద ఎత్తున ఫైర్ అయింది. అయితే తాను కట్టర్ హిందువునని తర్వాత జరిగిన ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పుకోవడంతో గొడవ సద్దుమనిగింది.

ఇక తాజాగా ఇదే కాంట్రవర్సీలో ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ చిక్కుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 1956 అక్టోబర్‭లో బౌద్ధం తీసుకున్నారు. దానిని అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు ధమ్మ చక్ర పరివర్తన్ దినంగా జరుపుకుంటారు. దీని గుర్తుగా కొంత మంది జన సమూహం బౌద్ధం తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన అంబేద్కర్ చేసిన 22 బౌద్ధ ప్రమాణాలు పటిస్తుండగా గౌరవంగా నిల్చున్నారు. అంతే.. హిందుత్వాన్ని రాజేంద్ర పాల్ అవమానించారంటూ భారతీయ జనతా పార్టీ సహా ఇతర రైట్ వింగ్ గ్రూపులు ఒంటి కాలిపై లేస్తున్నాయి.

The Nobel Peace Prize 2022: బెలారూస్ మానవ హక్కుల కార్యకర్తతో పాటు మరో 2 సంస్థలకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి

అంబేద్కర్ చేసిన ప్రమాణాల్లో ఏముంది?
తాను హిందువుగా పుట్టాను కానీ, హిందువుగా చావనని చెప్పిన డాక్టర్ అంబేద్కర్.. 1956 అక్టోబర్ 6న ఢిల్లీలోని అలీపూర్ మైదానంలో లక్షలాది మందితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధం తీసుకునే సమయంలో ఆయన 22 ప్రమాణాలు చేశారు. అందులో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను దేవుళ్లుగా భావించనని.. పార్వతి, లక్ష్మీ, గణపతులకు పూజలు చేయనని, ఇలా హిందూ దేవుళ్లను నమ్మనని, వారి విశ్వాసాలను పాటించనని ప్రమాణం చేశారు. చాలా చోట్ల బౌద్ధాన్ని స్వీకరిస్తున్న క్రమంలో ఈ ప్రమాణాలు చేస్తున్నారు.

అయితే ఇలా ప్రమాణాలు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొనడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. మంత్రితోనే ఆగకుండా.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‭ను సైతం ఇందులోకి లాగుతూ కేజ్రీవాల్, ఆప్ హిందుత్వ వ్యతిరేకి అంటూ మండిపడుతున్నారు. 22 ప్రమాణాలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీ పెద్ద ఎత్తున దాడికి దిగుతోంది.

Kushboo: ఆసుపత్రిలో నటి కుష్బూ.. త్వరలో కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ట్వీట్లు!

ట్రెండింగ్ వార్తలు