ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను చూడ‌కుండా క్రికెట్ వీరాభిమాని జార్వో పై నిషేదం విధించిన ఐసీసీ.. ఎందుకో తెలుసా..?

క్రికెట్ వీరాభిమానుల‌కు జార్వో 69 గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు జ‌రిగేట‌ప్పుడు ప‌దే ప‌దే గ్రౌండ్ మ‌ధ్య‌లోకి వ‌స్తుంటాడు గ‌దా అత‌నే.

ICC bans Jarvo

ODI World Cup : క్రికెట్ వీరాభిమానుల‌కు జార్వో 69 గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు జ‌రిగేట‌ప్పుడు ప‌దే ప‌దే గ్రౌండ్ మ‌ధ్య‌లోకి వ‌స్తుంటాడు గ‌దా అత‌నే. ముఖ్యంగా 2021లో ఇంగ్లాండ్‌-భార‌త్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు సిరీస్ సంద‌ర్భంగా మ‌నోడు టీమ్ఇండియా జెర్సీ ధ‌రించి గ్రౌండ్‌లోకి వ‌చ్చి మ్యాచ్‌ల‌కు అంత‌రాయం క‌లిగించాడు కూడా. దీంతో మ‌నోడు ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయ్యాడు. ఇత‌ను ఓ ప్ర‌ముఖ యూట్యూబ‌ర్. జార్వో అలియాస్ డేనియెల్ జార్విస్.

ప్ర‌పంచ‌కప్ మ్యాచ్‌కు సైతం

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ప్రారంభ‌మైంది. టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్ ను చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో ఆదివారం ఆడింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌కు కూడా జార్వో 69 అంత‌రాయం క‌లిగించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైన కాసేప‌టికే జార్వో గ్రౌండ్‌లోకి వ‌చ్చాడు. దీంతో కాసేపు మ్యాచ్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.

Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌.. అనిల్‌కుంబ్లే రికార్డు బ్రేక్‌

అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది అత‌డిని బ‌య‌టికి పంపించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. అత‌డు వెళ్లేందుకు నిరాక‌రించాడు. భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అత‌డి ద‌గ్గ‌ర‌కు వెళ్లి న‌చ్చ‌జెప్పి బ‌య‌ట‌కు పంపించాడు. ఈ ఘ‌ట‌న‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీరియ‌స్‌గా తీసుకుంది. అత‌డిపై నిషేదం విధించింది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు అత‌డు స్టేడియంలోకి హాజ‌రు కాకుండా చ‌ర్య‌లు తీసుకుంది.

ODI World Cup 2023: ఆ ఒక్క క్యాచ్ వదిలేసి.. భారత్ విజయానికి బాటలు వేసిన ఆసీస్.. వీడియో వైరల్’

‘వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రి భ‌ద్ర‌త మా బాధ్య‌త‌. అక్క‌డ ఏమీ జ‌రిగిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాము. ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటాం. జార్వో ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచుల‌కు హాజ‌రుకాకుండా నిషేదిస్తున్నాము. అత‌డు మ్యాచ్‌ల‌కు హాజ‌రు కాకుండా చూడాల్సిన బాధ్య‌త భార‌త అధికారుల చేతుల్లో ఉంది.’ అని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు