ODI World Cup 2023: ఇంగ్లాండ్ – భారత్ మ్యాచ్.. ఆ ఇద్దరు ప్లేయర్స్ లేకుండానే బరిలోకి టీమిండియా?

ఈనెల 19న పూణెలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డారు. గాయం కారణంగా ఆ మ్యాచ్ నుంచి తప్పుకోవటంతో పాటు.. ఈనెల 22న ధర్మశాలలో కివీస్ తో జరిగిన మ్యాచ్ కూ దూరమయ్యాడు.

Mohammed Shami

IND Vs ENG Match : వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ విజయయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. ఈనెల 29న ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. నవంబర్ 2న ముంబైలో శ్రీలంక జట్టుతో తలపడనుంది. అయితే ఈ రెండు మ్యాచ్ లకు టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్ 5న కోల్ కతాలో దక్షిణాప్రికాతో జరిగే మ్యాచ్ లోనూ పాండ్యా తుదిజట్టులో చేరకపోవచ్చని తెలుస్తోంది.

Sunil Gavaskar: కోహ్లి 50వ సెంచరీ చేసేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన గావస్కర్!

ఈనెల 19న పూణెలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డారు. గాయం కారణంగా ఆ మ్యాచ్ నుంచి తప్పుకోవటంతో పాటు.. ఈనెల 22న ధర్మశాలలో కివీస్ తో జరిగిన మ్యాచ్ కూ దూరమయ్యాడు. సోమవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కి నివేదించాడు. హార్దిక్ ఇంకా మందులు తీసుకుంటూనే ఉన్నాడని, అతని ఎడమ చీలమండపై వాపు బాగా తగ్గిందని, మరో మూడు నాలుగు రోజుల్లో అతను బౌలింగ్ ప్రారంభిస్తాడని ఎన్సీఏ పేర్కొంది. అయితే, పాండ్యా పూర్తిగా కోలుకున్న తరువాత మైదానంలోకి దించాలని బీసీసీఐ వైద్య బృందం భావిస్తోంది. దీంతో వచ్చే రెండు మ్యాచ్ లకు పాండ్యా ఆడే అవకాశాలు లేవని చెప్పొచ్చు.

ENG vs SL: శ్రీలంకతో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

పాండ్యాకు ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాండ్యా ఎంత సజావుగా బౌలింగ్ చేస్తాడనేదానిపై ఆయన తుదిజట్టులో ఎప్పుడు చేరుతాడనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాండ్యా పునరాగమనం ఇప్పట్లో ఉండదని, సెమీ – ఫైనల్ మ్యాచ్ ల నాటికి అతను అందుబాటులోకి వస్తాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదిలాఉంటే న్యూజిలాండ్ మ్యాచ్ లో పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో ఎంపికయ్యాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీ బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్ లో షమీ అద్బుతంగా రాణించినప్పటికి ఈనెల 29న ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం తక్కువేనని తెలుస్తోంది. లక్నో పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో షమీ స్థానంలో స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు