Sunil Gavaskar: కోహ్లి 50వ సెంచరీ చేసేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన గావస్కర్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 50వ ODI సెంచరీకి మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ముహూర్తం పెట్టేశాడు.

Sunil Gavaskar on Kohli 50th ODI Century

Sunil Gavaskar on Kohli 50th ODI Century: ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన అతడు 118 సగటుతో 354 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 48వ సెంచరీ సాధించాడు. ధర్మశాలలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ 95 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి సచిన్ టెండూల్కర్ రికార్డు(49)ను సమం చేసే ఛాన్స్ కొద్దిలో మిస్సయింది. అయితే ఈ వరల్డ్ కప్ లోనే సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నారు. డేటు, వెన్యు కూడా చెప్పేశారు.

ప్రపంచకప్ లో భాగంగా తన తర్వాతి మ్యాచ్ ల్లో టీమిండియా.. ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాతో ఆడనుంది. లక్నోలో అక్టోబర్ 29న ఇంగ్లండ్ జట్టుతో తలపడుతుంది. నవంబర్ 2న ముంబైలో జరిగే మ్యాచ్ లో శ్రీలంకను ఎదుర్కొటుంది. నవంబర్ 5న కోల్‌కతాలో సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. అయితే పుట్టినరోజు నాడు విరాట్ కోహ్లి వన్డే 50వ సెంచరీ కొడతాడని సునీల్ గావస్కర్ జోస్యం చెప్పాడు.

Also Read: యూసుఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అఫ్గాన్‌పై ఓట‌మి త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబ‌ర్ వెక్కి వెక్కి ఏడ్చాడు..!

కోహ్లి పుట్టినరోజు నవంబర్ 5. కోల్‌కతాలో సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో అతడు ఈ రికార్డు సాధిస్తాడని గావస్కర్ అంటున్నారు. “ఈడెన్ గార్డెన్ లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో కోహ్లి 50వ ODI సెంచరీ కొడతాడు. ఇటువంటి ఘనత సాధించడానికి పుట్టినరోజు కంటే మంచి సందర్భం ఏముంటుంది? అంతకంటే ముందు రెండు మ్యాచ్ లు ఆడతాడు కాబట్టి 49వ సెంచరీ పూర్తి చేసే అవకాశముంది. పరుగులు పిండుకోవడానికి ఈడెన్ గార్డెన్ మంచి వేదిక. ఇక్కడ కోహ్లి 50వ సెంచరీ సాధిస్తే ప్రేక్షకుల నుంచి స్లాండింగ్ ఓవెషన్ దక్కుతుంది. విజిల్స్, క్లాప్స్ తో స్టేడియం మార్మోగుతుంద”ని గావస్కర్ అన్నారు.

Also Read: ఆస్ట్రేలియా దెబ్బకు పాక్ జట్టుపై పెరిగిన ఒత్తిడి.. సెమీస్ ఆశలు గల్లంతేనా?

ప్రపంచకప్ లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకు తానాడిన 5 మ్యాచ్ ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫామ్ లో ఉండటంతో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. మిగతా మ్యాచ్ ల్లోనూ ఇదేవిధంగా రాణించి వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు