Roger Federer Video: ఆటకు వీడ్కోలు పలికిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. భావోద్వేగంతో కన్నీరు

నిన్న లావర్ కప్ డబుల్స్ లో ఆఖరి మ్యాచ్ రఫేల్ నాదల్ తో కలిసి ఆడాడు. రోజర్ ఫెదరర్-రఫేల్ నాదల్ ద్వయానికి, అమెరికాకు చెందిన జాక్ సోక్-ఫ్రాన్స్ టిఫోకి మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఫెదర్-నాదల్ ఓడిపోయారు. అనంతరం ఇంటర్య్వూలో మాట్లాడుతూ భాగోద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు తోటి ఆటగాళ్లను హత్తుకున్నాడు. రోజర్ ఫెదరర్ కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసిన నాదల్‌ కూడా కన్నీరు కార్చాడు. స్టేడయం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. తోటి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు ఫెదరర్ థ్యాంక్స్ చెప్పాడు. తన భార్య మిర్కాను హత్తుకుని ఏడ్చాడు.

Roger Federer Video: టెన్నిస్ దిగ్గజం, స్విస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ నిన్న లండన్‌లో జరిగిన లావర్ కప్ ఏటీపీతో ఆటకు వీడ్కోలు పలికాడు. ఇదే తన చివరి టోర్నమెంట్ అని అతడు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. 1998 నుంచి అతడు టెన్నిస్ ఆడుతున్నాడు. 24 ఏళ్ల కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 8 వింబుల్డన్ ట్రోఫీలు, ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్, 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు.

నిన్న లావర్ కప్ డబుల్స్ లో ఆఖరి మ్యాచ్ రఫేల్ నాదల్ తో కలిసి ఆడాడు. రోజర్ ఫెదరర్-రఫేల్ నాదల్ ద్వయానికి, అమెరికాకు చెందిన జాక్ సోక్-ఫ్రాన్స్ టిఫోకి మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఫెదర్-నాదల్ ఓడిపోయారు. అనంతరం ఇంటర్య్వూలో మాట్లాడుతూ భాగోద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు తోటి ఆటగాళ్లను హత్తుకున్నాడు. రోజర్ ఫెదరర్ కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసిన నాదల్‌ కూడా కన్నీరు కార్చాడు. స్టేడయం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. తోటి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు ఫెదరర్ థ్యాంక్స్ చెప్పాడు. తన భార్య మిర్కాను హత్తుకుని ఏడ్చాడు.

Rohit Sharma: టీ20ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ.. ఎన్ని సిక్స్‌లు కొట్టాడంటే?

ట్రెండింగ్ వార్తలు