Sachin Tendulkar Statue : భార‌త్‌, శ్రీలంక మ్యాచ్‌కు ముందే స‌చిన్ విగ్ర‌హావిష్క‌ర‌ణ.. ఎందుకో తెలుసా..?

క్రికెట్ దేవుడు, టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. దేశంలోని ప్ర‌ఖ్యాత‌ స్టేడియాల్లో ఒక‌టైన వాంఖ‌డే మైదానంలో స‌చిన్ టెండూల్క‌ర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.

Sachin Tendulkar Statue At Wankhede Stadium

Sachin Statue : క్రికెట్ దేవుడు, టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. దేశంలోని ప్ర‌ఖ్యాత‌ స్టేడియాల్లో ఒక‌టైన వాంఖ‌డే మైదానంలో స‌చిన్ టెండూల్క‌ర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన ప‌నులు అన్నీ పూర్తి అయ్యాయి. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా భార‌త్‌, శ్రీలంక జ‌ట్లు న‌వంబ‌ర్ 2న ఈ స్టేడియంలో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు అంటే న‌వంబ‌ర్ 1న స‌చిన్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.

విగ్రహాన్ని అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రసిద్ధ కళాకారుడు ప్రమోద్ కాంబ్లే రూపొందించారు. సచిన్ టెండూల్కర్ స్టాండ్ సమీపంలో ఈ విగ్రహాన్ని ఉంచ‌నున్న‌ట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్య‌క్షుడు అమోల్ కాలే తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు భార‌త జ‌ట్టు స‌భ్యులు, ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ODI World Cup 2023: ఇంగ్లాండ్ – భారత్ మ్యాచ్.. ఆ ఇద్దరు ప్లేయర్స్ లేకుండానే బరిలోకి టీమిండియా?

భార‌త్‌, శ్రీలంక మ్యాచ్‌కు ముందే ఎందుకు అంటే..?

2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ పైన‌ల్ మ్యాచ్ లో భార‌త్‌, శ్రీలంక జ‌ట్టు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌కు వాంఖ‌డే వేదిక అన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శ్రీలంక‌ను ఓడించిన భార‌త జ‌ట్టు దాదాపు 28 ఏళ్ల త‌రువాత‌ రెండో సారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌చిన్ కూడా స‌భ్యుడు. త‌న ఆరో ప్ర‌పంచ‌క‌ప్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ త‌న చిర‌కాల స్వ‌ప్నాన్ని అందుకున్నారు. దీంతో భార‌త్‌, శ్రీలంక మ్యాచ్‌కు ముందే స‌చిన్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం స‌చిన్ వ‌య‌స్సు 50 సంవ‌త్స‌రాలు అన్న సంగ‌తి తెలిసిందే.

పాప్‌కార్న్‌, శీత‌ల పానీయాలు ఫ్రీ..

ఇదిలా ఉంటే.. ఎంసీఏ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచుల్లో స్టేడియంలోని అభిమానులు అంద‌రికి ఉచితంగా పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్ ఉచితంగా అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. మంగళవారం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జ‌ట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. న‌వంబ‌ర్ 2 భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌తో ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి రానున్న‌ట్లు వెల్ల‌డించారు. అభిమానులు వేదిక వ‌ద్ద త‌మ టికెట్లు చూపించి ఉచిత పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్ తీసుకోవాల‌ని సూచించారు.

ODI World Cup 2023 : లైటింగ్ షో.. అభిమానులకు అనుభూతి.. క్రికెటర్లకు భయానక అనుభవం

ట్రెండింగ్ వార్తలు