Virat Kohli: వివ్ రిచర్డ్స్‌ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ

మాజీ క్రికెటర్లను ఇంప్రెస్ చేసేందుకు అస్సలు వెనుకాడడు విరాట్ కోహ్లీ. బ్యాట్ తోనే కాకుండా.. లెజెండ్లకు వీలైనంత మేర కృతజ్ఞత తెలిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ లిస్టులో సర్ వివియన్ రిచర్డ్స్ ను కూడా యాడ్ చేశాడు కోహ్లీ.

Virat Kohli: మాజీ క్రికెటర్లను ఇంప్రెస్ చేసేందుకు అస్సలు వెనుకాడడు విరాట్ కోహ్లీ. బ్యాట్ తోనే కాకుండా.. లెజెండ్లకు వీలైనంత మేర కృతజ్ఞత తెలిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ లిస్టులో సర్ వివియన్ రిచర్డ్స్ ను కూడా యాడ్ చేశాడు కోహ్లీ.

మైదానంలో పలు రికార్డులు నెలకొల్పిన రిచర్డ్స్ కోసం కోహ్లీ చేసిన పనిని ఇండియా మాజీ క్రికెటర్, వివేక్ రజదాన్ గుర్తు చేసుకున్నాడు. విమానంలో వెళ్లే సమయంలో కోహ్లీ తన లగేజి తీసి పక్కకుపెట్టి రిచర్డ్స్ బ్యాగేజి కోసం స్పేస్ క్రియేట్ చేశాడు.

“యాంటిగువాలో మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ జరిగే ప్లేస్ కు వెళ్లడానికి ప్లేయర్లు బయల్దేరుతున్నారు. ప్రొడక్షన్ క్రూ తర్వాత కామెంటేటరీ టీమ్ లో ఉన్న సునీల్ గవాస్కర్, వివియన్ రిచర్డ్స్ ఎక్కేందుకు వెళ్తున్నారు. రిచర్డ్స్ విమానమెక్కి ఓవర్‌హెడ్ లాకర్స్ లో బ్యాగ్ పెట్టుకోవాలనుకున్నారు. కానీ, అప్పటికే అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఒక్క చోటు కూడా స్పేస్ లేకపోవడంతో అన్నింటినీ తెరిచి చూస్తూ ఉన్నారు”

Read Also: పుష్ప ట్రెండ్‌లో జాయిన్ అయిన విరాట్ కోహ్లీ

“ఒకేసారి కోహ్లీ సీట్ లో నుంచి లేచి అక్కడకు చేరుకుని బ్యాగ్ ను సెట్ చేశాడు. చివరికి లాకర్ లో బ్యాగ్ పట్టకపోయేసరికి.. కోహ్లీ తన బ్యాగ్ ను తీసేసి పక్కకుపెట్టేశాడు. ఆ బ్యాగ్ తెచ్చుకుని తన సీట్ కింద పెట్టుకున్నాడు కోహ్లీ. అలా వివ్ రిచర్డ్స్ కోసం స్పేస్ ఏర్పాటు చేశాడు. ఆ పనికి రిచర్డ్స్ భుజం తట్టి థ్యాంక్స్ తెలియజేశాడు” అని రజదాన్ వెల్లడించాడు.

ట్రెండింగ్ వార్తలు