Joe Root : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచులో రూట్ అందుకున్న అరుదైన ఘ‌న‌త‌లు ఇవే..

ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జో రూట్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన 15వ ఆట‌గాడిగా నిలిచాడు.

Joe Root

Joe Root surpasses Sourav Ganguly : ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జో రూట్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన 15వ ఆట‌గాడిగా నిలిచాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచులో జో రూట్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రూట్ త‌న వ్య‌క్తిగ‌త స్కోరు 21 ప‌రుగులకు చేరుకోగానే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన 15వ ఆట‌గాడిగా నిలిచాడు.

ఈ క్ర‌మంలో అత‌డు భార‌త దిగ్గ‌జ ఆటగాడు, మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ని అధిగ‌మించాడు. సౌర‌వ్ గంగూలీ త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌లో 18,575 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో క‌లిపి రూట్ ఇప్పటి వరకు 429 ఇన్నింగ్స్‌లో 18,582 పరుగులు చేశాడు.

500 ఫోర్లు..

ఈ మ్యాచ్‌లో 18 ఓవ‌ర్‌లో జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన రూట్ వ‌న్డేల్లో ఓ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. వ‌న్డేల్లో ఇది అత‌డికి 500వ ఫోర్ కావ‌డం విశేషం. ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు ఇయాన్ మోర్గాన్ (588), మార్కస్ ట్రెస్కోథిక్ (528), ఇయాన్ బెల్ (525) ల త‌రువాత 500 ఫోర్లు కొట్టిన నాలుగో ఆట‌గాడిగా రూట్ రికార్డుల‌కు ఎక్కాడు.

MS Dhoni : ధోని బుగ్గ‌పై ముద్దు పెట్టిన బాలీవుడ్ న‌టుడు.. వైర‌ల్‌

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడిన ఇంగ్లాండ్ మొద‌ట బ్యాటింగ్ చేస్తోంది. 20 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 112/3. జో రూట్ (29), మొయిన్ అలీ (8) లు ఆడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు