Google AI Features India : గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త సెర్చ్ ఫీచర్లు.. భారతీయ యూజర్లు ఎలా వాడొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..!

Google AI Features India : భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను ప్రవేశపెడుతోంది. భారత్, జపాన్‌లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూల్‌లో జెనరేటివ్ AIని అందిస్తోంది. స్థానిక భాషలలో టెక్స్ట్ లేదా విజువల్ రిజల్ట్స్ చూడవచ్చు.

Google AI Features India : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) భారతీయ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది. ఇంటర్నెట్ దిగ్గజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence AI) ఆధారిత జెనరేటివ్ మోడల్‌తో కొత్త సెర్చ్ ఫీచర్ అందిస్తోంది. సెర్చ్ ల్యాబ్స్  (Search Labs) ద్వారా ఫీచర్‌ని టెస్టింగ్ చేసేందుకు ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులో ఉండే సైన్ అప్ ప్లాట్‌ఫారమ్ అని చెప్పవచ్చు. ఈ కొత్త ఏఐ ఫీచర్లను గూగుల్ క్రోమ్ (Google Chrome), గూగుల్ (Google App) యాప్‌లో కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయగలరు. ఒక మాటలో చెప్పాలంటే.. ఈ ఏఐ సెర్చ్ టూల్ ఏఐ చాట్‌బాట్ (AI Chatbot) లాంటి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. గూగుల్ ఒరిజినల్ సెర్చ్ బార్‌కి చాలా భిన్నంగా ఉంటుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇటీవలి కాలంలో చాలా పాపులర్ అయింది. జెనరేటివ్ మోడల్ ఉపయోగించి, జనరేటింగ్ టెక్స్ట్, ఇమేజ్, ఇతర మీడియా ఫార్మాట్లను రూపొందించగలదు. అయితే, ఈ ఏఐ ఫీచర్ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ దృష్టిని ఆకర్షించింది. వెంటనే తన సెర్చ్ ఫీచర్లలో అప్‌డేట్ చేసింది. ఏఐ ఫీచర్ల ద్వారా కొత్త, ఒరిజనల్ కంటెంట్‌ను రూపొందించడానికి ఇప్పటికే ఉన్న డేటాలోని మోడల్స్, నిర్మాణాలను గుర్తించవచ్చు.

Read Also : Google Warn Users : మీరు ఈ పని చేయకపోతే.. మీ జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లు డిలీట్ అవుతాయి జాగ్రత్త..!

జెనరేటివ్ AI యూజర్లకు సెర్చ్ రిజల్ట్స్ బాగా అర్థం చేసుకోవడానికి వీడియోలు, ఫొటోల రూపంలో టెక్స్ట్-ఆధారిత సెర్చ్ రిజల్ట్స్‌తో పాటు సందర్భోచిత కంటెంట్‌ను అందిస్తుంది. మరో అడుగు ముందుకు వేస్తూ.. గూగుల్ తన సెర్చ్ టూల్‌కి భారత్, జపాన్‌లోని యూజర్ల కోసం జెనరేటివ్ AIని తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో స్థానిక భాషలలో టెక్స్ట్ లేదా విజువల్ రిజల్ట్స్ చూడవచ్చు. గూగుల్ యూజర్లు ముందుగా తమ జీమెయిల్ IDతో సైన్ ఇన్ చేయాలి. ఆ తర్వాత గూగుల్ తమ వినియోగదారులకు (Search Lab experiments) ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపుతుంది.

ఇప్పుడు, టాప్ లెఫ్ట్‌లో ల్యాబ్స్ (Labs) ఐకాన్ ట్యాప్ చేయండి. మీరు ల్యాబ్స్ ఐకాన్ (Labs icon) కనిపించలేదంటే.. ప్రస్తుతం మీకు అందుబాటులో లేదని అర్థం. సెర్చ్ ల్యాబ్‌ల (Search Labs) లభ్యత గురించి తెలుసుకోండి. ల్యాబ్‌లను యాక్సెస్ చేయడానికి మీరు వెయిట్‌లిస్ట్‌లో చేరాల్సి రావచ్చు. అలా అయితే, (Join Waitlist) అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీకోసం ఎక్స్‌పర్మింట్స్ సిద్ధంగా ఉన్నప్పుడు ఇమెయిల్ నోటిఫికేషన్‌ను పొందుతారు.

Google AI Features India : Google Adds New Features To AI-Based Search In India_ All You Need To Know

మీకు ఆసక్తి కలిగించే experiment కనుగొనండి. experiment గురించి మరింత సమాచారం పొందడానికి కార్డ్‌ని (Card) ట్యాప్ చేసి experiment టర్న్ ఆన్ చేయండి. మీరు AI- పవర్డ్ ఓవర్‌వ్యూలో డేటా పక్కన బాణం గుర్తును చూడవచ్చు. అక్కడ సంబంధిత వెబ్ పేజీలను చూసేందుకు దానిపై క్లిక్ చేయవచ్చు. తద్వారా సైట్‌లను విజిట్ చేయడం ద్వారా మరింత సులభంగా తెలుసుకోవచ్చునని గూగుల్ తెలిపింది.

కొత్త ఏఐ ఫీచర్.. సెర్చ్ రిజల్ట్స్ ఎలా మారుస్తుందంటే? :
గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. జెనరేటివ్ AI యూజర్లను సెర్చ్ ఫలితాలను వేగంగా అర్థం చేసుకోవడంతో పాటు కొత్త విషయాలు, ఇతర సంబంధిత అంశాలను సులభంగా లోతుగా అధ్యయనం చేయడానికి సాయపడుతుంది. సెర్చ్ రిజల్ట్స్ పేజీలోని షార్ట్ వీడియోలు, ఫొటోలు, సంభాషణల నమూనాపై ఆధారపడి ఉంటాయి. వినియోగదారులకు టాపిక్‌లోని కొన్ని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది.

ఉదాహరణకు.. ఒక యూజర్ ‘హిమాచల్‌లో బిగినర్స్ ట్రెకింగ్ చేయగల ప్రాంతం ఏది? అందుకోసం ఎలా రెడీ కావాలి? అనే ప్రశ్న అడిగితే గూగుల్ జెనరేటివ్ AI దానికి సంబంధించిన కచ్చితమైన వివరాలను లోతుగా విశ్లేషించగలదు. ‘ట్రెక్‌లో అద్భుతమైన ఫొటోలను ఎలా తీయాలి? అనే మరో ప్రశ్నకు.. సంబంధిత సెర్చ్ లింక్‌లతో AI-ఆధారిత సెర్చ్ కీలక సమాచారాన్ని అందిస్తుంది. ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్నకు ఇంటర్ లింక్ కలిగిన సమాచారాన్ని కచ్చితమైన అంశాలతో అందిస్తుంది.

ఒక భాష నుంచి మరో భాషకు మారాలంటే? :
లాంగ్వేజ్ టోగుల్ బటన్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఇంగ్లీషు రిజల్ట్స్ నుంచి హిందీకి మారేందుకు యూజర్లకు గూగుల్ సెర్చ్ అనుమతిస్తుంది. టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ సాయంతో యూజర్లకు సెర్చ్ రిజల్ట్స్ అందిస్తుంది. అంతేకాదు.. యూజర్లు టైప్ చేయడానికి బదులుగా తర్వాతి ప్రశ్నలను అడగడానికి వీలుగా కన్వర్జేషనల్ మోడ్‌లో మైక్రోఫోన్ ఐకాన్ త్వరలో యాడ్ చేయనున్నట్టు గూగుల్ తెలిపింది.

AI-ఆధారిత సెర్చ్‌లో ఇతర ఫీచర్లు :
సెర్చ్ రిజల్ట్స్ కోసం వైడ్ రేంజ్ వాయిస్‌లను ఉపయోగిస్తుందని గూగుల్ బ్లాగ్ తెలిపింది. గూగుల్ పేజీ అంతటా యాడ్స్ స్లాట్‌లలో సెర్చ్ సంబంధిత యాడ్స్ ఉంటాయని పేర్కొంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు యునైటెడ్ స్టేట్స్‌ (US)లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు, భారత్ సహా జపాన్‌లోనూ అందుబాటులోకి తీసుకువస్తోంది. తద్వారా వినియోగదారులు ఈ ఏఐ ఫీచర్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని సెర్చ్ దిగ్గజం తెలిపింది.

Read Also : Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు..!

ట్రెండింగ్ వార్తలు