Paruchuri Gopala Krishna : చంద్రబాబు రాముడు, పవన్ లక్ష్మణుడు లాగా.. పవన్ కళ్యాణ్ పై పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ తన యూట్యూబ్ ఛానల్ పరుచూరి పలుకులులో ఓ స్పెషల్ వీడియో చేసారు.

Paruchuri Gopala Krishna : ఏపీలో పవన్ కళ్యాణ్ పదేళ్లుగా కష్టపడి ఈసారి ఎవరూ ఊహించని విజయాన్ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు. అధికారులని పరుగులు పెట్టిస్తూ, సమస్యలని పరిష్కరిస్తూ పాలనలో పవన్ తన మార్క్ ని చూపిస్తున్నారు. మరో పక్క ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబుకు పూర్తి సహకారం అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ విజయంపై ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు అభినందించి మాట్లాడారు. తాజాగా సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ తన యూట్యూబ్ ఛానల్ పరుచూరి పలుకులులో ఓ స్పెషల్ వీడియో చేసారు.

Also Read : Ashwatthama : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా ‘అశ్వత్థామ’.. ‘హనుమాన్’ డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

ఈ వీడియోలో పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. పవన్ అప్పుడప్పుడు సడెన్ గా నవ్వుతాడు. ఆ నవ్వుకి చాలా అర్థాలు ఉంటాయి. చాలా సార్లు గమనించాను ఎప్పుడు నవ్వుతాడు, ఎందుకు అని. దాంట్లో చాలా లోతైన అర్దాలు ఉంటాయి. ఆయన్ని నేను అభిమానిస్తాను. కానీ ఆయన సినిమాలకు రాసే అదృష్టం మాకు రాలేదు. రాజకీయాల్లో నిలబడతాడా లేదా అని అందరూ విమర్శిస్తుంటే చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు మాట్లాడింది సినిమా డైలాగ్స్ కాదు. చాలా ఆలోచించి మాట్లాడారు, ఇప్పుడు అయన మాట్లాడిన దానికి తగ్గట్టు పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా, ఎంతో ఓపికగా, ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టాలని పని చేస్తున్నారు. చంద్రబాబు రాముడు అయితే పవన్ లక్ష్మణుడులాగా.. ఆయన కృష్ణుడు అయితే ఈయన అర్జునుడిగా ఉండాలి. ఇద్దరూ కలిసి పనిచేయాలి. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుంటే అలాగే చూస్తూ కూర్చున్నాను. ఎదిగేకొద్దీ ఒదిగే ఉంటాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇంకా ఎదగాలి అని అన్నారు.

Also Read : Aham Reboot : ‘అహం రీబూట్’ మూవీ రివ్యూ.. సుమంత్ ఒక్క పాత్రతోనే థ్రిల్లర్ సినిమా..

అలాగే సినీ పరిశ్రమ, పవన్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ లాగే పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు చేయాలి. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా అప్పుడప్పుడు 10 రోజులు డేట్స్ ఇస్తూ సినిమాలు చేసేవారు. పవన్ కళ్యాణ్ కూడా అలా సినిమాలు చేయాలి. అలాగే సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అందరి తరపున ఒక విన్నపం. 24 క్రాఫ్ట్స్ తో ఒకసారి మీరు, సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఒక మీటింగ్ పెట్టి అందరి సమస్యలు విని మాకు, సినీ పరిశ్రమకు, రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. దీంతో పరుచూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు