Motorola Edge 40 Launch : వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో మోటోరోలా 5G ఫోన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Motorola Edge 40 Launch : కొత్త 5G ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా నుంచి ఎడ్జ్ 40 ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. 8GB RAM, 256GB స్టోరేజ్‌తో సింగిల్ మోడల్‌కు రూ.29,999 ధరను అందిస్తోంది.

Motorola Edge 40 Launch in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా (Motorola) ఇప్పటికే రెండు సరసమైన (Moto G) సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఆ తర్వాత, మోటోరోలా ఇండియా (Motorola India)లో అధికారికంగా (Motorola Edge 40)ని ఆవిష్కరించింది. ఈ ఫోన్ “IP68” రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చింది. మోటో Edge 40 అనేది MediaTek Dimensity 8020 SoCని కలిగిన ఫస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. అంతేకాదు.. వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందించే ఫోన్లలో మొదటిది. ఈ 5G ఫోన్‌ రూ. 30వేల లోపు ధరలో 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

భారత్‌లో మోటోరోలా Edge 40 ధర ఎంతంటే? :
మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో సింగిల్ మోడల్‌కు రూ.29,999 ధరను కలిగి ఉంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. వేగన్ లెదర్ ఎండ్ రెసెడా గ్రీన్, ఎక్లిప్స్ బ్లాక్, PMMA (యాక్రిలిక్ గ్లాస్) ఎండ్ లూనార్ బ్లూతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మే 30 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా ఛానెల్‌లలో సేల్ అందుబాటులో ఉంది.

Read Also : Ola Electric Funding : ఈవీ స్కూటర్ మేకర్ ఫండ్ రైజింగ్ ప్లాన్.. రూ.2,500 కోట్ల నిధులు దక్కించుకున్న ఓలా..!

రిలయన్స్ డిజిటల్‌తో సహా పార్టనర్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ చేసేందుకు అందుబాటులో ఉంది. మోటోరోలా కస్టమర్‌లకు రూ. 3,100 విలువైన బెనిఫిట్స్ అందించే జియోతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇందులో రూ. 1,000 విలువైన 100GB అదనపు 5G డేటా (నెలకు 10GB), Ajio, Ixigo, ET Prime నుంచి రూ. 1,050 విలువైన పార్టనర్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

Motorola Edge 40 with 144Hz curved display, wireless charging launched

మోటోరోలా Edge 40 స్పెసిఫికేషన్స్ :
మార్కెట్లోకి కర్వడ్ డిస్ప్లేలతో రూ. 30వేల విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయి. మోటరోలా ఇదే డిస్‌ప్లే స్టైల్‌పై వచ్చింది. కర్వ్డ్ డిస్‌ప్లే సొంత లిమిట్స్ ఉన్నప్పటికీ, ప్రీమియం ఎండ్ విషయంలో ఎంతమాత్రం రాజీపడటం లేదు. మోటోరోలా pOLED ప్యానెల్‌ను ఉపయోగించింది. 6.5-అంగుళాల డిస్‌ప్లే Full-HD రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. వేగన్ ఎండ్ వేరియంట్‌లు కొంచెం (7.58 మిమీ) మందంగా ఉంటాయి. PMMA ఎండ్ వేరియంట్ 7.49mmతో వస్తుంది. ఇప్పటికీ సెగ్మెంట్‌లోని సన్నని స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. మోటోరోలా ఎడ్జ్ 40 HDR10+, Amazon HDR ప్లేబ్యాక్, Netflix HDR ప్లేబ్యాక్‌కు సపోర్టు ఇస్తుందని పేర్కొంది.

ఈ ఫోన్ వెనుకవైపు, OISతో కూడిన 50-MP ప్రైమరీ కెమెరా ఉంది. మాక్రో విజన్‌తో కూడిన 13-MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రెంట్ సైడ్ 32-MP కెమెరా ఉంది. రెండు బ్యాక్ కెమెరాలు 30fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా అదే సామర్థ్యాన్ని అందిస్తుంది. మోటోరోలా Egde 40 ఫోన్ 256GB UFS 3.1 స్టోరేజీ, 8GB LPDDR4xతో MediaTek డైమెన్సిటీ 8020 SoC నుంచి పవర్ అందిస్తుంది. Edge 40 ఇతర ముఖ్య ఫీచర్లలో 5G, రెండు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4400mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ అందిస్తుంది.

Read Also : Reliance JioMart Layoffs : కోత మొదలైంది.. జియోమార్ట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. మరో 9వేల జాబ్స్ తగ్గించే అవకాశం..!

ట్రెండింగ్ వార్తలు