Apple IPhone 14 Series: భారత్‌లో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులోకి ఎప్పుడొస్తుంది? ధరలు ఎలా ఉన్నాయంటే?

టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి అత్యంత అట్టహాసంగా కొత్త ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.

Apple IPhone 14 Series: టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి అత్యంత అట్టహాసంగా కొత్త ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. దీనికితోడు యాపిల్ వాచీ సిరీస్8, వాచీ ఎస్ఈ2, కొత్తతరం ఎయిర్ పాడ్స్ ప్రోలను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇవి ఆ నెల 16వ తేదీన యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఇండియన్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 9నుండి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే భారత్ లో వీటి ధరలను యాపిల్ సంస్థ ప్రకటించింది.

Apple Iphone

ఇండియాలో ఐఫోన్ 14 ధరలు ఇలా ఉన్నాయి..
iPhone 14 128GB: రూ. 79,900
iPhone 14 256GB: రూ. 89,900
iPhone 14 512GB: రూ 1,09,900

iPhone 14 Plus

ఇండియాలో ఐఫోన్ 14 ప్లస్ ధరలు ఇలా ఉన్నాయి
iPhone 14 Plus 128GB: రూ. 89,900
iPhone 14 Plus 256GB: రూ. 99,900
iPhone 14 Plus 512GB: రూ 1,19,900.

iPhone 14 Plus

భారతదేశంలో iPhone 14 Pro ధరలు ఇలా..
iPhone 14 Pro 128GB: రూ 1,29,900
iPhone 14 Pro 256GB: రూ 1,39,900
iPhone 14 Pro 512GB: రూ 1,59,900

iPhone 14 Pro Max

భారత్ లో iPhone 14 Pro Max ధరలుఇలా
iPhone 14 Pro Max 128GB: Rs 1,39,900
iPhone 14 Pro Max 256GB: Rs 1,49,900
iPhon14 Pro Max 512GB: Rs 1,69,900

iPhone 14 Pro, iPhone 14 Pro Max డీప్ పర్పుల్, గోల్డ్, సిల్వర్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి. ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం 5.30 గంటలకు ప్రీ ఆర్డర్స్ మొదలవనుండగా.. సెప్టెంబర్ 16వ తేదీ సేల్‌కు వస్తాయి.

ట్రెండింగ్ వార్తలు