KTR Criticized Amit Shah : అమిత్‌షా తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్‌ వేదికగా అమిత్‌ షా టూర్‌పై కేటీఆర్‌ సెటైర్లు వేశారు. కిందిస్థాయి నుంచి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన క్రికెటర్‌ అంటూ అమిత్‌షా తనయుడు జైషాపైనా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

KTR criticized Amit Shah : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్‌ వేదికగా అమిత్‌ షా టూర్‌పై కేటీఆర్‌ సెటైర్లు వేశారు. కిందిస్థాయి నుంచి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన క్రికెటర్‌ అంటూ అమిత్‌షా తనయుడు జైషాపైనా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ ప్రముఖ క్రికెటర్‌ తండ్రి హైదరాబాద్‌ వస్తున్నారని..అన్న ఎంపీగా ఉన్న ఓ పెద్ద మనిషికి ప్రచారం చేస్తాడంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఈ పెద్దమనిషి మనకు వారసత్వ రాజకీయాలపై క్లాస్‌ పీకుతారంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు తెలంగాణలో అమిత్‌ షా పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండుగంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 2.20 నిమిషాలకు బేగంపేట నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Amit Shah Ujjaini Ammavari Temple : సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు

ఆలయంలో అమిత్‌షాకు స్వాగతం పలికిన అర్చకులు.. పూజల అనంతరం ఆశీర్వచనాలు అందించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా.. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌లో పూజల అనంతరం అమిత్‌ షా.. సికింద్రాబాద్‌లోని ఓ సామాన్య కార్యకర్తను సర్‌ ప్రైజ్ చేశారు. 30 ఏళ్లుగా బీజేపీకి సేవలందిస్తోన్న ఎస్సీ మెర్చా కార్యదర్శి మంద సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. సత్యనారాయణ, ఆయన కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు