Thatikonda Rajaiah : టికెట్‌ రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఘన్ పూర్ ప్రజల మధ్యే తన జీవితం ఉంటుందని, ప్రజల కోసమే తాను పని చేస్తానని తెలిపారు. Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah – Station Ghanpur : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే రాజయ్య తన వర్గీయులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వర్షంలో తడుస్తూ కాసేపు మౌన ప్రదర్శన చేశారు. తన అనుచరులను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని కాసేపు కన్నీరు పెట్టారు.

బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు తాను విధేయుడిగా ఉన్నానని గుర్తుకు తెచ్చుకున్నారు. తన స్థాయికి తగ్గకుండా కేసీఆర్ ఉన్నత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఘన్ పూర్ ప్రజల మధ్యే తన జీవితం ఉంటుందని, ప్రజల కోసమే తాను పని చేస్తానని తెలిపారు. కాగా, తాను కేసీఆర్ గీసిన గీతను దాటను అని తేల్చి చెప్పారు రాజయ్య. అంతే కాదు మీరు కూడా పార్టీ నిర్ణయం మేరకే నడుచుకోవాలని తన వర్గీయులతో చెప్పారు రాజయ్య.

Also Read: కాషాయ దళంలో హీట్‌పుట్టిస్తోన్న కిషన్ రెడ్డి, సంజయ్ వైఖరి!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం(ఆగస్టు 21) మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందు నుంచి ఊహించినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు కేసీఆర్. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు. అన్ని విధాలుగా ఆలోచించాకే వారిని తప్పించినట్టు బీఆర్ఎస్ బాస్ తెలిపారు. ఇక, నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయలేదు.

ఉప్పల్, వేములవాడ, బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్ పూర్, వైరా స్థానాల్లో సిట్టింగ్ లకు చోటు దక్కలేదు. కామారెడ్డి నుంచి స్వయంగా తానే బరిలోకి దిగుతున్నా కాబట్టి అది మార్పు కిందకు రాదన్నారు కేసీఆర్. ఈ సీటును కూడా కలుపుకుంటే మొత్తం 8 మంది సిట్టింగ్ కు చోటు దక్కలేదని భావించాల్సి ఉంటుంది. ఇక హుజురాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి టిక్కెట్ దక్కించుకున్నారు. వివాదాస్పదంగా మారిన జనగాం, నర్సాపూర్ స్థానాలను పెండింగ్ లో పెట్టారు. గోషామహల్, నాంపల్లి స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు.

Also Read: వారితో మాట్లాడిన తరువాతనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.. తప్పకుండా నా కొడుక్కి నేను సపోర్ట్ చేస్తా

ముందు నుంచి ఊహించినట్టుగా స్టేషన్ ఘన్ పూర్ లో తీవ్రమైన వివాదాల్లో కూరుకుపోయిన తాటికొండ రాజయ్యకు చుక్కెదురైంది. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్.

ట్రెండింగ్ వార్తలు