Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాలకు తొలిపూజ.. ఈసారి మట్టి వినాయకుడు.. ఎత్తు ఎంతంటే

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు తొలిపూజ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నారు.

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శుక్రవారం తొలిపూజ నిర్వహించారు. నిర్మల్ ఏకాదశిని పురస్కరించుకుని ఖైరతాబాద్‌ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం కర్ర పూజ చేశారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. గతేడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఉత్సవ కమిటీ గుర్తు చేసింది. ఇక, విగ్రహం ఎత్తును 50 అడుగులుగా నిర్ణయించారు. పీవోసీ విగ్రహాలపై ఆంక్షలతో గణేశ్ విగ్రహ ఎత్తును ఉత్సవ కుదించినట్లు ఉత్సవ కమిటీ పేర్కొంది.

మట్టి మహాగణపతి నిమజ్జనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చని, ఆ సమయంలో నిరాటంకంగా 4 గంటల పాటు వర్షం వచ్చినా ఎలాంటి సమస్య ఉండదని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భగవంత్‌ రావు కోరారు.

vinayaka chavithi: మట్టి వినాయకుడ్ని మాత్రమే ఎందుకు పూజించాలంటే!

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గురించి తెలియని వారుండరు. ఆ పేరు వింటే.. వెంటనే మనకు వినాయకుడు గుర్తొస్తాడు. భారీ గణనాథుడు కళ్ల ముందు కనిపిస్తాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ ఖైరతాబాద్ వినాయకుడికి అంత ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈసారి వినాయక ఉత్సవాలపై ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Khairatabad Ganesh (2)

ఖైరతాబాద్‌లో గణనాథుడు భారీ ఆకారంలో ఏటా దర్శనమిస్తాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే ఆ విగ్రహం తయారీకి కొన్ని నెలల సమయం పడుతుంది. దాదాపు ఆరు నెలల నుంచే కసరత్తు ప్రారంభిస్తారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఖైరతాబాద్‌లో గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కమిటీ కన్వీనర్ సందీప్, ఉపాధ్యక్షుడు మహేష్ యాదవ్, తదితరులు సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మట్టి విగ్రహ ఏర్పాటు చేయనన్నట్లు తెలిపారు. మట్టి విగ్రహాలనే వాడాలని గతేడాది ఉత్సవాల సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఉత్సవ కమిటీ గుర్తు చేసింది. మట్టి విగ్రహం ఎత్తు 50 అడుగుల మేర ఉంటుందని వెల్లడించింది.

Khairatabad Ganesh 2021: తొలి పూజకు సిద్ధమైన ఖైరతాబాద్ మహా గణపతి

ఈ నెల 24న హైకోర్టులో వినాయక విగ్రహాల తయారీపై వాదనలు ఉన్నాయని.. ఆ రోజు వచ్చే తీర్పును బట్టి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

Khairatabad Ganesh (4)

ట్రెండింగ్ వార్తలు