Pm Modi : అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా సిద్ధంగా ఉంది- కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్

కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం.

Pm Modi : దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని మండిపడ్డారు. తెల్ల వాళ్లు, నల్ల వాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కూటమి బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

”వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. వైసీపీ మంత్రి ఇక్కడ రౌడీ రాజ్యం నడుపుతున్నారు. శాండ్ మాఫియాతో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. 12 మంది మరణించారు. ఈ విషయం నాకు చాలా ఆందోళన కలిగించింది. ఏపీలోని మాఫియాలన్నింటికీ ఎన్డీఏ ప్రభుత్వం ట్రీట్‌మెంట్‌
చేస్తుంది. ఇక్కడ వైసీపీ రౌడీ రాజ్యం నడుస్తోంది. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసింది. పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కోసం.. వైసీపీ పని చేసింది.

అనేక సహజవనరులు ఉన్న నేల రాయలసీమ. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా నీళ్లు అందించాలనేది మా లక్ష్యం. కేంద్ర పథకం జల్‍జీవన్ మిషన్‍కు వైసీపీ ప్రభుత్వ సహకారం లేదు. దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధం. తెల్ల వాళ్లు, నల్ల వాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ పూర్తయింది. కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం. ఏపీకి బుల్లెట్ రైలు కావాలా? వద్దా? రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. టమటా నిల్వ కోసం శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం” అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read : పవన్ కల్యాణ్‌.. నీ చరిత్ర బయటపెట్టు: ముద్రగడ పద్మనాభం

 

ట్రెండింగ్ వార్తలు