Chandrababu Naidu : బుజ్జగింపులు.. రోజంతా బిజీబిజీగా చంద్రబాబు

టీడీపీ నేతలు ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్నపాత్రుడు, ముక్కా రూపానంద రెడ్డి చంద్రబాబును కలిశారు.

Chandrababu Naidu : టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదలతో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. టికెట్ ఆశించిన పలువురు సీనియర్ నేతలు భంగపడ్డారు. టికెట్ దక్కకపోవడం, తొలి జాబితాలో పేరు లేకపోవడం వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ రోజంతా బుజ్జంగిపులతో చంద్రబాబు బిజీబిజీగా గడిపేశారు. కొందరు నేతలకు హామీలు ఇచ్చారు. మరికొందరికి స్పష్టత ఇచ్చారు.

టీడీపీ నేతలు ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్నపాత్రుడు, ముక్కా రూపానంద రెడ్డి చంద్రబాబును కలిశారు.

చీపురుపల్లి నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఇక, విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం అంటూ నమస్కారం చేసి వెళ్లిపోయారు దేవినేని ఉమ. చంద్రబాబుతో భేటీ అనంతరం సంతృప్తితో వెళ్లారు ఆలపాటి రాజా, బొడ్డు వెంకట రమణ చౌదరి. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారట. రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుంటే ఆ స్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామన్నారు చంద్రబాబు.

పీలా గోవింద్ ను చంద్రబాబు ఇంటికి వెంట పెట్టుకొచ్చారు అయ్యన్నపాత్రుడు. చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా పీలా గోవింద్ అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. తనకు రాజంపేట టికెట్ ఇవ్వాలని ముక్కా రూపానంద రెడ్డి చంద్రబాబును కోరారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు